News January 9, 2026
వీఆర్‌ఓల పనితీరులో మార్పు అవసరం: కలెక్టర్

ఐవీఎస్ సర్వేలో 13 మంది వీఆర్‌ఓలు కేవలం 50 శాతం మాత్రమే పనితీరు కనబరిచిన నేపథ్యంలో కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు రెవెన్యూ సేవలు అందించడంలో నిర్లక్ష్యం లేకుండా, సమయానికి అందించాలని వీఆర్‌ఓలను ఆదేశించారు. సంబంధిత వీఆర్‌ఓలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. పనితీరులో స్పష్టమైన మార్పు రాకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ గంగధర్ గౌడ్ ఉన్నారు.
Similar News
News February 12, 2026
ACTRECలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

టాటా మెమోరియల్ సెంటర్ -అడ్వాన్స్‌డ్ సెంటర్ ఫర్ ట్రీట్‌మెంట్, రీసెర్చ్& ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్(ACTREC) 25 మెడికల్, నాన్ మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు మార్చి 4వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో DM/DNB, MD, MSc/మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్/MBBS/BDS/BAMS/BHMS/ఫార్మా డీ, BSc అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://actrec.gov.in
News February 12, 2026
శివ నామాలు అర్థాలు ‘‘చంద్రశేఖర’’

దక్షుడి శాపం వల్ల చంద్రుడి కళలు క్షీణించి, ఉనికినే కోల్పోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు చంద్రుడు శివుడిని శరణు వేడగా ఆయన కరుణించాడు. చంద్రుడిని తన తలపై నెలవంకగా ధరించాడు. అలా చంద్రుడికి పునర్జన్మనిచ్చి లోకానికి వెలుగు ప్రసాదించాడు. తనను ఆశ్రయించిన వారికి మృత్యు భయం ఉండదని చెప్పడానికి ఇదొక నిదర్శనం. చంద్రుడిని శిఖరంపై(తలపై) అలంకారంగా ధరించిన వాడు కాబట్టి ఆయనను ‘చంద్రశేఖరుడు’గా కీర్తిస్తున్నాం.
News February 12, 2026
SRD: ఓట్లు బ్యాలెట్ బాక్సులో.. అభ్యర్థుల్లో టెన్షన్

సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 11 మున్సిపాలిటీల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో భద్రపరిచారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, స్వాతంత్ర అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. గెలుపోటములపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేది ఎవరనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అభ్యర్థుల జయాపజయాలు రేపు జరగనున్న కౌంటింగ్‌లో తేలనుంది.


