News April 13, 2025
వీఆర్ పురం : ఉరివేసుకుని బాలిక మృతి

వీఆర్ పురం మండలం జీడిగుప్పలో శనివారం 15 ఏళ్ల బాలిక చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందినట్లు ఎస్సై సంతోశ్ కుమార్ తెలిపారు. చింతూరు మండలం వెదుళ్లపల్లికి చెందిన బాలిక కుటుంబం మిరప తోటల్లో పని చేయడానికి నెల రోజుల క్రితం జీడిగుప్ప వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్లి పోదామని బాలికతల్లిని కోరగా ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్సై తెలిపారు.
Similar News
News September 18, 2025
సిరిసిల్ల జిల్లాలో వర్షపాతం నమోదిలా..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు వర్షపాత నమోదు వివరాలు ఇలా ఉన్నాయి. రుద్రంగి 2.3, చందుర్తి 13.8, వేములవాడ రూరల్ 22.2, బోయిన్పల్లి 14.9, వేములవాడ 16.6, సిరిసిల్ల 23.0, కొనరావుపేట 15.7, వీర్నపల్లి 11.0, ఎల్లారెడ్డిపేట 1.4, గంభీరావుపేట 26.9, ముస్తాబాద్ 5.4, తంగళ్లపల్లి 5.6, ఇల్లంతకుంటలో 11.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
News September 18, 2025
మల్యాల: ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువలో వృద్ధురాలి శవం

ఎస్సారెస్పీ కాలువలో కొట్టుకువచ్చిన ఓ వృద్ధురాలి శవాన్ని మల్యాల మండలం నూకపల్లి బ్రిడ్జి వద్ద స్థానికులు గమనించారు. శవం మరింత ముందుకు కొట్టుకుపోకుండా తాళ్లతో కట్టి ఉంచారు. ఆమె నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ గ్రామానికి చెందిన ప్రభావతిగా గుర్తించారు. ఆమెకు మతిస్థిమితం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. సమాచారమందుకున్న పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 18, 2025
అఫ్జల్‌సాగర్‌లో గల్లంతు.. భీమలింగం బ్రిడ్జిపై లభ్యం

వలిగొండ (మం) సంగం భీమలింగం బ్రిడ్జిపై గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. అఫ్జల్‌సాగర్ నాలాలో 4రోజుల క్రితం గల్లంతైన అర్జున్ మృతదేహంగా అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి బయలుదేరారు.