News February 28, 2025
వీఈఆర్‌లో మౌలిక సదుపాయాలపై చర్చ

విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్) పరిధిలోని ఉమ్మడి ఉత్తరాంధ్ర, పూర్వ తూర్పుగోదావరి జిల్లాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఆయా జిల్లాల కలెక్టర్లతో పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ వర్చువల్ సమావేశంలో చర్చించారు. వీఎంఆర్డీఏ కార్యాలయం నుంచి ఈసమావేశంలో నీతి ఆయోగ్ పథక సంచాలకులు పార్థసారథి, విశ్రాంత ఐఏఎస్ కిషోర్, వీఎంఆర్డీఏ ఎంసీ విశ్వనాథన్ పాల్గొన్నారు.
Similar News
News March 1, 2025
విశాఖలో TODAY TOP NEWS

➤ KGHలో నకిలీ డాక్టర్.. రూ.లక్షతో పరార్..!
➤ ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా సంధ్యాదేవి
➤ సింహాద్రి, జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లు రద్దు
➤ బాధ్యతలు స్వీకరించనున్న AU వీసీ జి.పి రాజుశేఖర్
➤ ప్రత్యేక అలంకరణలో చంద్రంపాలెం దుర్గాలమ్మ
➤ ఆటోనగర్, ఐటీ హిల్స్ ప్రాంతాలకు ప్రత్యేక RTC సర్వీసులు నడపాలి: కలెక్టర్
➤ విశాఖలో చిట్టీల పేరుతో ఘరానా మోసం
➤ జిల్లాలో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు రాయనున్న 83,001 మంది
News February 28, 2025
బాధ్యతలు స్వీకరించనున్న ఏయూ వీసీ

ఆంధ్ర యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్సలర్‌గా జి.పి.రాజశేఖర్ శనివారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఏయూ రిజిస్ట్రార్ ధనుంజయరావు శుక్రవారం తెలిపారు. శనివారం ఉదయం బాధ్యతలు స్వీకరించిన అనంతరం యూనివర్సిటీ విభాగాల అధిపతులను కలుస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి సందర్శకులను కలవనున్నట్లు తెలిపారు. ఇన్నాళ్లు ఏయూ ఇన్ ఛార్జ్ వీసీగా ఉన్న శశిభూషణరావు రేపు బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.
News February 28, 2025
మరింత అప్రమత్తంగా ఉంటాం: విశాఖ కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీపం -2 పథకం అమల్లో మరింత అప్రమత్తంగా ఉంటామని,సబ్సిడీ నగదు వెనువెంటనే లబ్దిదారుల ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. వివిధ సంక్షేమ పథకాల స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.