News November 27, 2025
వీటిని ఫ్రిడ్జ్‌లో పెట్టక్కర్లేదు!

మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చిన వెంటనే ఫ్రిడ్జ్‌లో సర్దేస్తుంటారు చాలామంది. నిజానికి అన్నీ ఫ్రిజ్‌లో పెట్టాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, గుమ్మడి, వెల్లుల్లి, సిట్రస్ ఫ్రూట్స్, ఆపిల్స్, పియర్స్, అప్రికాట్స్, మామిడి, టమాట వంటివీ గది ఉష్ణోగ్రత దగ్గరే నిల్వచేయొచ్చు. అవి పండిపోయి త్వరగా వాడలేనప్పుడే ఫ్రిజ్‌లో పెట్టాలి. పండ్ల పక్కనే ఆకుకూరల్ని పెడితే త్వరగా పాడైపోతాయి.
Similar News
News November 27, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో నిన్నటి కన్నా ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గురువారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.12,550
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.11,546
☛ వెండి 10 గ్రాములు: రూ.1662.00
News November 27, 2025
ఆ సమయంలో ఎంతో బాధపడ్డా: మంచు లక్ష్మి

నటి మంచు లక్ష్మి తన కుటుంబంలో జరిగిన విభేదాలపై తొలిసారి స్పందించారు. దేవుడు వరం ఇస్తే కుటుంబం మళ్లీ సంతోషంగా కలిసి ఉండాలని కోరుకుంటానని తెలిపారు. భారతీయ కుటుంబాల్లో గొడవలు సహజమని, కానీ చివరికి అందరూ ఒక్కటిగా ఉండటం ముఖ్యమన్నారు. గొడవల గురించి తాను బాధపడలేదన్న వార్తలు తప్పు అని, ఆ సమయంలో తీవ్రమైన మానసిక వేదన అనుభవించినప్పటికీ బయటపెట్టలేదని తెలిపారు. వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇష్టపడనని అన్నారు.
News November 27, 2025
లోకేశ్ విమాన ప్రయాణాలపై TDP క్లారిటీ.. YCP కౌంటర్

AP: మంత్రి లోకేశ్ విమాన ప్రయాణాలకు ప్రభుత్వ డబ్బులు వాడారన్న విమర్శలపై ఆర్టీఐ వివరాలతో TDP క్లారిటీ ఇచ్చింది. 77 సార్లు ప్రత్యేకంగా విమానాల్లో ప్రయాణించినా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ నిధులు ఉపయోగించలేదని పేర్కొంది. ప్రయాణాలన్నింటికీ లోకేశ్ సొంత సొమ్ము వెచ్చించినట్లు సంబంధిత వివరాలను షేర్ చేసింది. అదే నిజమైతే బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను బయట పెట్టాలంటూ YCP కౌంటర్ ఇచ్చింది.


