News March 27, 2025
వీడియో కాన్ఫరెన్స్‌లో మహబూబాబాద్ కలెక్టర్

హైదరాబాదు నుంచి సెర్ఫ్ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లతో పంచాయతీరాజ్ కార్యదర్శి లోకేశ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. యాసంగి మార్కెటింగ్ సీజన్‌లో సెర్ఫ్ ద్వారా ఏర్పాటు చేయబోయే ఐకెపీ కొనుగోలు కేంద్రాల సంఖ్య గణనీయంగా పెంచాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. ప్రస్తుతం 33శాతం ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈ సీజన్ నుంచి 50శాతానికి పెంచాలన్నారు.
Similar News
News November 7, 2025
SKLM: సెకండ్ సాటర్డే సెలవులు రద్దు

రానున్న ఏడాది ఫిబ్రవరి నెల వరకు సెకండ్ సాటర్డే సెలవులు ఉండవని డీఈవో కే.రవిబాబు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రేపు యథావిధిగా జిల్లాలో పాఠశాలలు నడుస్తాయన్నారు. ఇటీవల సంభవించిన మొంథా తుఫాన్ సందర్భంగా సెలవులను వీటి ద్వారా భర్తీ చేస్తున్నామన్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి నుంచి ఉత్తర్వులు వచ్చాయని, విద్యాసంస్థలు ఈ విషయాన్ని గ్రహించాలని ఆయన కోరారు.
News November 7, 2025
ప్రచారం తప్ప బాబు చేసిందేమీ లేదు: కన్నబాబు

AP: డేటా ఆధారిత పాలన అంటూ ప్రచారమే తప్ప CM CBN చేసిందేమీ లేదని మాజీ మంత్రి కన్నబాబు విమర్శించారు. ‘500 వాట్సాప్ సేవల ద్వారా ఆన్లైన్లోనే సమస్యలన్నిటినీ పరిష్కరిస్తున్నామని చెబుతున్నారు. మరి లోకేశ్ ప్రజాదర్బార్‌కు 4వేల అర్జీలు ఎందుకు వచ్చాయి? ప్రతిసారీ ఓ కొత్తపదంతో పబ్లిసిటీ చేసుకుంటూ మోసగించడం చంద్రబాబుకు అలవాటు’ అని విమర్శించారు. సచివాలయం వంటి వ్యవస్థలను తెచ్చి జగన్ చరిత్రలో నిలిచారన్నారు.
News November 7, 2025
HYD సైబర్ క్రైమ్ దుమ్మురేపే ఆపరేషన్

HYD సైబర్ క్రైమ్ పోలీసులు అక్టోబర్ ఆపరేషన్‌లో భారీ దందాలు ఛేదించారు. మొత్తం 196 కేసులు, 55 అరెస్టులు, ₹62 లక్షల రిఫండ్ చేశారు. డిజిటల్ అరెస్ట్‌లు, ఇన్వెస్ట్‌మెంట్ & ట్రేడింగ్ ఫ్రాడ్స్, సోషల్ మీడియా మోసాల్లో దేశంలోని 8 రాష్ట్రాల నుంచి నిందితులు పట్టుబడ్డారు. సైబర్ నేరగాళ్ల బ్యాంక్ ఖాతాల్లో రూ.107 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. మరిన్ని కేసుల్లో రూ.లక్షల్లో రిఫండ్ చేశారు.


