News April 9, 2025

వీణవంక: వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా ముద్దసాని!

image

కమలాపూర్ నియోజకవర్గం అంటే గుర్తుకు వచ్చేది ముద్దసాని దామోదర్ రెడ్డి అని చెప్పవచ్చు. 1985, 1989, 1994, 1999లో టీడీపీ నుంచి పోటీ చేసి వరుసగా 4సార్లు MLAగా విజయం సాధించాడు. 29 ఏళ్లకే MLAగా, 30ఏళ్లకు మంత్రిగా నియోజకవర్గానికి సేవలందించాడు. వీణవంక(M) మామిడాలపల్లి గ్రామానికి చెందిన దామోదర్‌రెడ్డి 2012 ఏప్రిల్‌ 9న అనారోగ్యంతో మృతిచెందాడు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ప్రజలు ఆయన సేవలు గుర్తుచేసుకుంటున్నారు.

Similar News

News November 6, 2025

HYD: మీర్జాగూడ యాక్సిడెంట్.. యువకుడి మెసేజ్ వైరల్!

image

ట్రాఫిక్ రూల్స్‌పై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ఓ యువకుడు చేసిన పని అందరినీ ఆలోచింపజేస్తోంది. ‘రూల్స్ ఎప్పుడూ ఇబ్బందిగా అనిపిస్తాయి. మన ప్రాణాలు కాపాడేవి అవే. త్వరగా వెళ్లాలంటే ముందు జాగ్రత్తగా వెళ్లాలి. మీ ఇంటికెళ్తూ వేరే ఇళ్లల్లో కన్నీళ్లు మిగిల్చకండి’ అంటూ మూసాపేట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ యువకుడు ఇలా ప్లకార్డులు పట్టుకొని కనిపించాడు. మీర్జాగూడ ఘటన నేపథ్యంలో యువకుడు ఇచ్చిన మెసేజ్ వైరలవుతోంది.

News November 6, 2025

‘SIR’ను వ్యతిరేకించిన మమతకూ ఫామ్ ఇచ్చిన BLO

image

SIRకు వ్యతిరేకంగా 2 రోజుల కిందట బెంగాల్ CM మమతా బెనర్జీ <<18197344>>ర్యాలీ<<>> నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాతి రోజే ఓటర్ లిస్ట్ ఎన్యుమరేషన్ ఫామ్‌ను ఆమె అందుకున్నారు. కోల్‌కతాలోని CM నివాసానికి నిన్న బూత్ లెవల్ ఆఫీసర్ వెళ్లారు. ఫామ్‌ను నేరుగా మమతకే ఇస్తానని సెక్యూరిటీ సిబ్బందికి BLO చెప్పినట్లు సమాచారం. దీంతో స్వయంగా మమత వచ్చి తీసుకున్నారని తెలుస్తోంది. దాన్ని నింపిన తర్వాత BLOకు ఇవ్వనున్నారు.

News November 6, 2025

పీయూకి నేడు మందకృష్ణ మాదిగ రాక

image

పాలమూరు విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయ ఆడిటోరియంలో మధ్యాహ్నం రెండు గంటలకు రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయిపై దాడులకు వ్యతిరేకంగా చలో ఢిల్లీ కార్యక్రమం ఈనెల 17న నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఈ సమావేశంలో ప్రణాళిక సిద్ధం చేయనున్నారు.