News November 1, 2025
వీధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు: DEO

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఈఓ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయ పాలన పాటించడం లేదనే విషయం తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, హాజరును ఫేస్ రికగ్నైజేషన్ యాప్‌లో నమోదు చేయాలని డీఈఓ సూచించారు.
Similar News
News November 1, 2025
కొత్తగూడెం: ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసిన కలెక్టర్

ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం తనిఖీ చేశారు. ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎం భద్రతకు సంబంధించి ప్రతినెల తనిఖీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ పరిశీలనలో భాగంగా సీసీ కెమెరా గదిలో కెమెరాల పనితీరును పరిశీలించారు. గోడౌన్ పరిసర ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచాలని, అనుమతి లేనిదే ఎవరిని లోపలికి రానివ్వకూడదని అధికారులకు సూచించారు. అనంతరం తనిఖీ రిజిస్టర్లో సంతకం చేశారు.
News November 1, 2025
బీఆర్ఎస్ పార్టీలో నాకు అవమానం జరిగింది: కవిత

బీఆర్ఎస్ పార్టీలో నాకు అవమానం జరిగింది.. అందుకే బయటకు వచ్చానని కరీంనగర్‌లో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్‌లో ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తనను కలిచి వేసిందని, ఉద్యమకారులు, నాయకులు బీఆర్ఎస్ పార్టీలో ఇబ్బంది పడుతున్నారన్నారు. పార్టీపై పూర్తిస్థాయిలో నిర్ణయాలు తీసుకొని మరిన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తానని తెలిపారు.
News November 1, 2025
పర్యాటక ప్రాంతాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

నగరంలోని పార్కులను, పర్యాటక ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. నగరంలోని పలు పార్కులను ఆయన సందర్శించారు. ఈనెల 14, 15వ తేదీల్లో జరిగే ప్రపంచ స్థాయి భాగస్వామ సదస్సుకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు నగరానికి వస్తారని తెలిపారు. అందుకు తగ్గట్టు చర్యలు చేపట్టాలని సూచించారు.


