News October 31, 2025
వీపనగండ్ల: మైనర్ బాలికకు నిశ్చితార్థం: నలుగురిపై కేసు

వీపనగండ్ల మండలంలో 15 ఏళ్ల మైనర్ బాలికకు నిశ్చితార్థం జరిపించినందుకు పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు గురువారం చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అమ్మాయి తల్లి, అబ్బాయి, అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాణి తెలిపారు. మైనర్‌ను వివాహమాడిన, ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
Similar News
News October 31, 2025
PHOTO: సీఎం రేవంత్‌తో సల్మాన్ ఖాన్

TG CM రేవంత్‌తో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ భేటీ అయ్యారు. కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ శిండే మనవరాలి పెళ్లి సందర్భంగా నిన్న ముంబై వెళ్లిన రేవంత్‌తో సల్మాన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీ గురించి వీరిద్దరూ మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్’ నినాదానికి వరల్డ్ వైడ్‌గా ప్రచారం కల్పిస్తానని సల్మాన్ చెప్పినట్లు సమాచారం.
News October 31, 2025
అజ్జూ భాయ్ ప్రమాణం.. అందరి చూపు ఈసీ వైపు!

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ నేత అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తోందని బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడంతో నేడు ఆయన ప్రమాణ స్వీకారంపై సందిగ్ధం నెలకొంది. అయితే మ.12.15 గం.కు ఆయన ప్రమాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లడంతో ఏం సమాధానం వస్తుందోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది.
News October 31, 2025
ఓపెన్ స్కూల్ 10TH, ఇంటర్ ఫలితాలు విడుదల.. ములుగు జిల్లా టాప్!

ఈ ఏడాది SEPTలో నిర్వహించిన ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను రాష్ట్ర ఓపెన్ స్కూల్ డైరెక్టర్ విడుదల చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ములుగు జిల్లా అత్యధిక ఉత్తీర్ణత సాధించింది. 10THలో 87.50%, ఇంటర్‌లో 70.08% ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలిచింది. హనుమకొండలో టెన్త్ 77.14%, వరంగల్‌లో 31.18%, మహబూబాబాద్‌లో 78.95% సాధించారు. రీవెరిఫికేషన్‌కు NOV 4 నుంచి 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.


