News December 9, 2024

వీరఘట్టం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

వీరఘట్టం మండలం వండువ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరఘట్టంకు చెందిన కూర్మాన అశోక్ చక్రవర్తి (35) అనే వ్యక్తి మృతి చెందాడు. కొంతకాలంగా పాలకొండలో నివాసం ఉంటున్న అతడు ఆదివారం వీరఘట్టం వచ్చి తిరిగి పాలకొండ వెళుతుండగా మార్గ మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటనపై ఎస్సై కళాధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News December 26, 2024

మెగాస్టార్‌తో అచ్చెన్నాయుడు మటామంతీ

image

మెగాస్టార్ చిరంజీవితో గురువారం రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముచ్చటించారు. శంషాబాద్‌లో జరిగిన ఒక వేడుకలో(మంత్రి టీజీ భరత్ కుమార్తె వివాహం)లో చిరంజీవి, అచ్చెన్నాయుడు కలుసుకున్నారు. ఒకరినొకరు స్నేహపూర్వకంగా కరచాలనం చేసుకుని కొద్ది నిమిషాలు మాట్లాడుకున్నారు. ఈ మేరకు చిరంజీవితో అచ్చెన్నాయుడు మాట్లాడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు పంచుకున్నారు.

News December 26, 2024

SKLM: పలు రైళ్లకు అదనపు కోచ్‌లు

image

సంక్రాంతి సీజన్ సందర్భంగా పలు రైళ్లకు అదనపు కోచ్‌లను జత చేస్తున్నట్లు వాల్తేరు డివిజన్ డీఆర్ఎం సందీప్ బుధవారం తెలిపారు. విశాఖ-గుణపూర్-విశాఖ ప్యాసింజర్ స్పెషల్‌కు జనవరి ఒకటి నుంచి 31 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ను జత చేస్తున్నారన్నారు. భువనేశ్వర్-తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు జనవరి 4 నుంచి 25 వరకు, తిరుగూ ప్రయాణంలో జనవరి 5 నుంచి 26 వరకు ఒక థర్డ్ ఏసీ కోచ్‌ను జత చేస్తున్నట్లు తెలిపారు.

News December 26, 2024

మందస: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

image

శ్రీకాకుళం జిల్లా మందస మండలం పితాతొలి గ్రామ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. పలాస నుంచి మందసకు వెళ్తుండగా బైక్ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో సొండిపూడి లైన్ మేన్ జోగారావుతో పాటు మరో యువకుడు కిరణ్‌కు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఆసుపత్రికి తరలించారు.