News March 1, 2025

వీరఘట్టం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

వీరఘట్టం తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొట్టుగుమ్మడ గ్రామానికి చెందిన శివ అనే వ్యక్తి మృతి చెందాడు. ట్రాక్టర్‌పై వెళ్తున్న శివ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఎస్సై జి. కళాధర్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

Similar News

News March 1, 2025

నంద్యాల జిల్లాలో 87.75% పింఛన్ల పంపిణీ.!

image

ఎన్టీఆర్ భరోసా పథకం కింద నంద్యాల జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కాగా.. మ.2:30 గంటలకు నంద్యాల జిల్లాలో 87.75% పింఛన్ల పంపిణీ పూర్తయింది. కాగా ఇప్పటివరకు జిల్లాలో 2,15,031 మందికి గానూ 1,88,688 మందికి సచివాలయ ఉద్యోగులు పింఛన్ సొమ్మును అందజేశారు.

News March 1, 2025

సాలూర పీహెచ్సీని తనిఖీ చేసిన కలెక్టర్

image

సాలూర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఆయా విభాగాలను సందర్శించి, రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును పరిశీలించారు. అందుబాటులో ఉన్న మందుల స్టాక్, వైద్యులు, సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. ఇన్ పేషంట్ వార్డును సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు.

News March 1, 2025

‘ఛావా’ తెలుగు ట్రైలర్ ఎప్పుడంటే?

image

మరాఠా యోధుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ సినిమాను తెలుగులోనూ విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ట్రైలర్‌ను ఈ నెల 3న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ పేర్కొంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్కీ కౌశల్, రష్మిక నటించారు. హిందీలో కలెక్షన్లు కొల్లగొడుతున్న ఈ సినిమా ఈ నెల 7న తెలుగులో రిలీజ్ కానుంది.

error: Content is protected !!