News December 24, 2025
వీరికి ఎదుటివారి బాధలు అర్థం కావు!

రాజా వేశ్యా యమశ్చాగ్నిః చోరాః బాలక యాచకః
పరదుఃఖం నజానంతి అష్టమో గ్రామ కంటకాః
తమ స్వభావం, వృత్తి ధర్మాల వల్ల కొందరు ఎదుటివారి బాధలను పట్టించుకోరు. రాజు అధికార గర్వంతో, వేశ్య ధనం కోసం, యముడు ప్రాణాలు తీయడమే విధిగా ఉండటం వల్ల కఠినంగా ఉంటారు. అగ్ని సర్వాన్ని దహిస్తుంది. దొంగ స్వార్థంతో దోచుకుంటాడు. బాలకులు అజ్ఞానంతో, యాచకులు అవసరం కోసం, గ్రామ కరణం(అధికారి) స్వలాభం కోసం ఇతరుల కష్టాన్ని అర్థం చేసుకోరు.
Similar News
News December 24, 2025
మొదటి ప్లమ్ కేక్ స్టోరీ: మంబల్లి బాపు మ్యాజిక్!

మన దేశంలో మొదటి ప్లమ్ కేక్ 1883లో కేరళలోని తలస్సేరిలో తయారైంది. మంబల్లి బాపు అనే బేకరీ యజమాని దీన్ని తయారు చేశారు. అప్పటి బ్రిటిష్ ఆఫీసర్ ఇంగ్లండ్ నుంచి తెచ్చిన కేక్ తిని దాన్ని మన దేశీ స్టైల్‌లో రీక్రియేట్ చేశారు. విదేశీ బ్రాందీకి బదులు స్థానిక జీడిమామిడి పండ్ల సారా, అరటిపండ్లు వాడి అద్భుతమైన రుచిని తెచ్చారు. ఇప్పటికీ అదే పాత పద్ధతిలో కట్టెల పొయ్యి మీద ఈ కేకులను తయారు చేస్తున్నారు.
News December 24, 2025
పద్మ అవార్డులు పేర్ల ముందు, వెనుక ఉంచొద్దు: బాంబే హైకోర్టు

‘పద్మ’ అవార్డులను పేర్ల ముందు, వెనుక వినియోగించుకోరాదని బాంబే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పద్మ అవార్డీ శరద్ హార్దికర్ కేసులో కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఆయా రంగాల్లో చేసిన కృషి, సామాజిక సేవకు గుర్తింపుగా ప్రభుత్వం ఈ అవార్డులు అందిస్తోందని, దీన్ని గౌరవంగా భావించాలే తప్ప టైటిల్‌గా కాదని స్పష్టం చేసింది. కాగా దీనిపై సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది. అయినా కొందరు పట్టించుకోవడం లేదు.
News December 24, 2025
ఒంటరిగా గెలవలేకే ఉద్ధవ్ సోదరులు కలిశారు: మహా CM

రష్యా, ఉక్రెయిన్ శాంతి చర్చలు జరుగుతున్న రేంజ్‌లో వారి కలయికను <<18657891>>ఉద్ధవ్ సోదరులు<<>> చూపుతున్నారని మహారాష్ట్ర CM ఫడణవీస్ ఎద్దేవా చేశారు. బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడిన శివ్ సేన (UBT), మహారాష్ట్ర నవ్‌నిర్మాణ సేన (MNS) కలయిక వల్ల ప్రజలకు ప్రయోజనం ఉండదన్నారు. సిద్ధాంతాలు పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసమే కలిశారని చెప్పారు. ఈ 2 పార్టీలు విడివిడిగా పోటీ చేసి గెలవలేవని తేలిపోయిందన్నారు.


