News November 6, 2025

వీరుల రక్తపు ధారలు ప్రవహించిన పల్నాడు

image

నాటి వీరులు వాడిన ఆయుధాలనే దేవతలుగా పూజించే ఆచారం పల్నాడు జిల్లా కారంపూడిలో ఉంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా పోతురాజుకు పడిగం కట్టి పల్నాటి వీరుల ఉత్సవాలకు పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ్ శ్రీకారం చుట్టారు. ఈ నెల 19 నుంచి 23 వరకు 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. మినీ మహాభారతంగా, ఆంధ్ర కురుక్షేత్రంగా పిలవబడే పల్నాటి యుద్ధ సన్నివేశాలను ఈ ఉత్సవాలలో నిర్వహిస్తారు.

Similar News

News November 6, 2025

పోష్, పోక్సో చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: ఇన్చార్జ్ కలెక్టర్

image

పోష్ చట్టం-2013, పోక్సో చట్టం-2012లపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఇన్చార్జ్ జిల్లా కలెక్టర్ శ్రీజ అన్నారు. గురువారం ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉద్యోగ స్థలాల్లో మహిళల రక్షణకు పోష్ చట్టం పొందించబడిందని, దీని కింద 90 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని సూచించారు. పిల్లల రక్షణకు పోక్సోలో కఠిన శిక్షలు ఉన్నాయని తెలిపారు.

News November 6, 2025

KMR: మిడ్ డే మీల్స్ పెండింగ్ బిల్లులను చెల్లించాలని వినతి

image

పెండింగ్‌లోని బిల్లులను వెంటనే విడుదల చేయాలని మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు డిమాండ్ చేశారు. గురువారం కామారెడ్డి కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. MDM నిర్వహణ కమిటీ అధ్యక్షురాలు హేమలత మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన పథకానికి సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో సుమారు రూ.8 కోట్లు పెండింగ్ బకాయిలు విడుదల కావాల్సి ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలన్నారు.

News November 6, 2025

SRD: ‘సైబర్ మోసాలకు గురైతే ఇలా చేయండి’

image

విద్యార్థులు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెల్ డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి సూచించారు. సంగారెడ్డి మండలం పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. సెల్ ఫోన్లలో వచ్చే ఏపీకే ఫైల్స్‌ను ఓపెన్ చేయవద్దని హెచ్చరించారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే https://www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు తెలిపారు.