News October 20, 2024

వీర మరణం పొందిన కడప జిల్లా జవాన్‌ ఇతనే.!

image

కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన కొడవటికంటి రాజేశ్ ఛత్తీస్‌గఢ్‌లోని మిజాపూర్‌ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP)లో జవాన్‌గా పనిచేస్తున్నాడు. కాగా శనివారం నక్సల్స్ అమర్చిన ల్యాండ్ మైన్ పేలి మృతి చెందాడు. ఈ విషయం తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా మృతి చెందిన జవాన్‌కు ముగ్గురు పిల్లలు, భార్య ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు.

Similar News

News October 30, 2025

రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

కొండాపురంలోని పాత కొండాపురం సమీపంలో చిత్రావతి నది వంతెన సమీపంలో గురువారం రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. అతను రైలు కింద పడడంతో అతని తల, మొండెం రెండు భాగాలుగా విడిపోయాయి. మృతుడి ఒంటిపై పసుపు కలర్ చొక్కా, బ్లూ కలర్ పాయింట్ ఉన్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 30, 2025

ప్రొద్దుటూరు: కుమారుని వివాహానికి వెళ్తూ తండ్రి మృతి

image

నెల్లూరు జిల్లాలో కుమారుని వివాహానికి వెళ్తూ ప్రొద్దుటూరుకు చెందిన బాషా సయ్యద్ పాల్ (50) మృతి చెందారు. బుధవారం రాత్రి నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈయన మృతి చెందారు. దీంతో పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. UPకి చెందిన సయ్యద్ పాల్ ప్రొద్దుటూరులో ఉంటున్నారు. ఆయనతో పాటు సమీప బంధువు సయ్యద్ ఆసిఫ్(20) కూడా మృతి చెందాడు.

News October 30, 2025

యువతను ఉద్యోగాల సృష్టి దిశగా నడిపించే “స్టార్టప్ కడప హబ్”

image

యువత ఉద్యోగాల సృష్టి దిశగా ఎదగాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం స్ఫూర్తిదాయకమని నీతి ఆయోగ్ జాయింట్ సెక్రటరీ, ఆకాంక్షిత జిల్లా ప్రాబరీ అధికారి సిద్ధార్థ్ జైన్ అన్నారు. కడప ఆర్ట్స్ కాలేజ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న రూ.10 కోట్ల “స్టార్టప్ కడప హబ్” పనులను జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరితో కలిసి పరిశీలించారు. ఈ భవనం 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక సదుపాయాలతో నిర్మాణం అవుతుందని కలెక్టర్ తెలిపారు.