News March 18, 2025
వృత్తిని ప్రేమించి.. బాధ్యతగా పని చేయండి: అజయ్ రావు

వృత్తిని ప్రేమించి బాధ్యతగా పని చేయాలని ఎక్సైజ్ అకాడమీ డైరెక్టర్ అజయ్ రావు అన్నారు. ఎక్సైజ్ శాఖలో మహిళా కానిస్టేబుళ్లుగా శిక్షణ పూర్తి చేసుకున్న 129 మంది విధుల్లో చేరుతున్న కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేసి.. శిక్షణలో నైపుణ్యం కలిగిన వారికి ఆయన సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
Similar News
News March 19, 2025
ఓయూ లా కోర్సుల పరీక్ష తేదీల ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని లా కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. మూడేళ్ల ఎల్ఎల్బీ, మూడేళ్ల ఎల్ఎల్బీ ఆనర్స్, ఐదేళ్ల బీఏ ఎల్ఎల్బీ, ఐదేళ్ల బీకాం ఎల్ఎల్బీ, ఐదేళ్ల బీబీఏ ఎల్ఎల్బీ కోర్సుల మూడో సెమిస్టర్ రెగ్యులర్, ఎల్ఎల్ఎం మొదటి, మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈ నెల 27వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
News March 18, 2025
ఈడీ వద్దకు చేరిన బెట్టింగ్ యాప్స్ కేసు

బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన యూట్యూబర్ల వివరాలపై ఈడీ ఆరా తీసింది. చెల్లింపుల వ్యవహారంపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను తెప్పించుకుంది. హవాలా రూపంలో చెల్లింపులు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తోంది. 11 మంది వివరాలు సేకరించి.. ఎవరెవరికి ఎంత డబ్బులు ముట్టాయని ఈడీ ఆరా తీస్తోంది.
News March 18, 2025
సీఎంకి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యేలు

బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకువచ్చిన బిల్లులకు శాసనసభ ఆమోదం తెలపడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య యాదవ్, షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్, ప్రకాశ్‌గౌడ్, మాజీ ఎంపీ హనుమంతరావు కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. బలహీనవర్గాల హక్కుల కోసం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సీఎంని ప్రశంసించారు.