News December 11, 2025
వృద్ధురాలిపై అత్యాచారం.. నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష

60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి సిద్దిపేట కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. చిన్నకోడూరు మండలం గ్రామానికి చెందిన వృద్ధురాలిని అదే గ్రామానికి చెందిన కొమ్ము నరసయ్య తన వాహనంపై తీసుకెళ్లి అత్యాచారం చేశాడన్నారు. ఈ కేసులో నిందితునికి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించినట్లు సీపీ పేర్కొన్నారు.
Similar News
News December 11, 2025
రాజన్న సిరిసిల్ల: తొలి విడత ఎన్నికల్లో హస్తం హవా..!

రాజన్న సిరిసిల్ల జిల్లా తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధిక స్థానాలు సాధించారు.
76 సర్పంచ్ స్థానాలకు కాంగ్రెస్ 37, బీఆర్ఎస్ 27, బీజేపీ 5 స్థానాలు గెలవగా ఏ పార్టీతో సంబంధం లేని వారు 7 చోట్ల గెలిచారు. ఏకగ్రీవ ఎన్నిక స్థానాల్లో కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 3 దక్కించుకోవడంతో మొత్తం కాంగ్రెస్ 43 పంచాయతీలలో, బీఆర్ఎస్ 30, బీజేపీ 5, స్వతంత్ర ఏడుగురు గెలిచారు.
News December 11, 2025
ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్ ఎన్నికలు.. ప్రకటించిన CEC

బంగ్లాదేశ్‌లో ఫిబ్రవరి 12న సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్నట్టు CEC నజీర్ ఉద్దీన్ ఇవాళ ప్రకటించారు. ‘డిసెంబర్ 29న నామినేషన్లు, జనవరి 22 నుంచి పోలింగ్‌కు 48గంటల ముందు వరకు ప్రచారానికి అవకాశం ఉంటుంది. 300 పార్లమెంటరీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయి. పోలింగ్ రోజే ‘జులై చార్టర్’పై ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఉదయం 7:30 నుంచి సాయంత్రం 4:30 వరకు పోలింగ్ నిర్వహిస్తాం’ అని మీడియాకు తెలిపారు.
News December 11, 2025
మెదక్: ‘ఉపాధ్యాయులకు ఓడి అవకాశం కల్పించాలి’

మెదక్ జిల్లా విద్యాధికారిని గురువారం ఉపాధ్యాయ సంఘం నాయకులు కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులందరికీ ఎన్నికలు జరిగిన మరుసటి రోజు ఓడి సదుపాయం కల్పించాలని మెదక్ జిల్లా విద్యాధికారి విజయకు ఉపాధ్యాయ సంఘాలు వినతి పత్రం సమర్పించారు. ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో ఉన్నవారికి సమస్యలు పరిష్కారం కోసం వినతి పత్రం సమర్పించినట్టు తెలిపారు.


