News March 22, 2025
వృద్ధురాలిపై అత్యాచారయత్నం

నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వృద్ధురాలు మధ్యాహ్నం తన కల్లంలో నిద్రిస్తుండగా ఓ వ్యక్తి అక్కడికొచ్చి ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి రాగానే.. అతడు పరారయ్యాడు. పోలీసులకు గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో వారు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 22, 2025
నంద్యాల జిల్లాలో దారుణ హత్య

నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలం లింగాపురంలో శనివారం దారుణ హత్య చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నంద్యాల సుధాకర్ రెడ్డి పొలం వద్దకు వెళ్తుండగా కొత్తచెరువు దగ్గర మాటువేసిన గుర్తుతెలియని దుండగులు ఆయనను అత్యంత కిరాతకంగా నరికి చంపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
News March 22, 2025
నేడు ఓర్వకల్లుకు పవన్ కళ్యాణ్ రాక

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కర్నూలు జిల్లాకు రానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే నీటి కుంటల పనులను ఓర్వకల్లు మండలం పూడిచర్లలో ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు.
News March 22, 2025
కర్నూలు: జిల్లా కోర్టుల్లో “మధ్యవర్తిత్వం” కేంద్రాలు ఏర్పాటు

సుప్రింకోర్ట్ ఆదేశాల ప్రకారం అన్ని జిల్లా కోర్టుల్లో మధ్యవర్తిత్వం కేంద్రాలు ప్రవేశ పెట్టాలని తీర్మానించిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు జి.కబర్ది తెలిపారు. జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్లో న్యాయవాదులకు జరిగిన శిక్షణ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అధితిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కభర్ది హాజరై మాట్లాడారు.