News February 2, 2025
వృద్ధులకు ప్రత్యేకంగా బస్సు సౌకర్యం ఏర్పాటు: కలెక్టర్

వయోవృద్ధులు తమ సమస్యలను తెలియజేసేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేందుకు ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పిస్తామని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు అన్నారు. వారి కొరకు ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా అధికారులు బాలు నాయక్ తదితరులు ఉన్నారు.
Similar News
News November 5, 2025
పల్వంచ: చదువుల తల్లికి గుడి కట్టిన దేవుళ్లు వీరే!

ఫరీద్‌పేట్ గ్రామంలో నూతన గ్రంథాలయం బుధవారం ప్రారంభమైంది. జీడిపల్లి నర్సింహా రెడ్డి తన కూతురు, తండ్రి స్మారకార్థం రూ. 20 లక్షల సొంత నిధులతో ఈ భవనాన్ని నిర్మించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు, యువకులు ఈ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకొని, ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడాలని దంపతులిద్దరూ ఆకాంక్షించారు. గ్రంథాలయ ఏర్పాటుకు కృషి చేసిన వీరికి పలువురు అభినందించి శాలువాతో సత్కరించారు.
News November 5, 2025
షమీకి మరోసారి నిరాశ.. రీఎంట్రీ కష్టమేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి మరోసారి నిరాశ ఎదురైంది. NOV 14 నుంచి సౌతాఫ్రికాతో జరిగే రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్‌కు BCCI ప్రకటించిన <<18208501>>జట్టులో<<>> ఆయనకు చోటు దక్కలేదు. ఇటీవల ఆస్ట్రేలియా సిరీస్‌కూ ఆయన్ను సెలక్ట్ చేయని సంగతి తెలిసిందే. దీంతో షమీ కెరీర్ ముగిసినట్లేనా అని క్రికెట్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. కాగా ఇటీవల రంజీ ట్రోఫీలో ఆయన 3 మ్యాచుల్లో 15 వికెట్లు పడగొట్టారు.
News November 5, 2025
కొత్తగా 8 జిల్లాల ఏర్పాటుకు సూచనలు: అనగాని

AP: కొత్తగా 8 జిల్లాల ఏర్పాటుకు పలు వర్గాల నుంచి సూచనలు వచ్చాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల కోసమూ వినతులు అందినట్లు చెప్పారు. పాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొనే వీటిపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. CM సూచనతో అల్లూరి(D)లో ప్రత్యేక అభివృద్ధి మండలి ఏర్పాటుపై ఆలోచనలు చేస్తున్నామన్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అక్రమాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.


