News March 28, 2025
వెంకటగిరిలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

తిరుపతి జిల్లా వెంకటగిరిలో శుక్రవారం ఒక్కసారిగా ఉష్ణోగ్రత 42.2°C డిగ్రీలు నమోదయిందని అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాధారణ ఉష్ణోగ్రత ఉండగా మధ్యాహ్నం ఒక్కసారి ఉష్ణోగ్రతలు పెరిగాయి. వృద్ధులు, చిన్నారులు ఎండ వేడిమి తాళలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజు రోజుకి ఉష్ణోగ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఎండ నుంచి రక్షణ పొందేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Similar News
News July 5, 2025
కోహెడ: ‘గురుకుల మైదానంలో మొక్కలు నాటాలి’

గురుకుల మైదానంలో మొక్కలు నాటాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె.హైమావతి సూచించారు. కోహెడ మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఆకస్మికంగా తనికి చేశారు. రిజిస్టర్ వెరిఫై చేసిన అనంతరం పాఠశాల మైదానాన్ని పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
News July 5, 2025
ఏలూరు: ప్రమాద బీమా కేసులో రూ.85 లక్షల పరిహారం

ఏలూరు కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ ప్రారంభ సమావేశం జరిగింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి మాట్లాడుతూ.. కక్షి దారులకు త్వరితగతిన కేసులు పరిష్కారం కోసం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 35 బెంచీలను ఏర్పాటు చేసి కేసుల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తున్నామని తెలిపారు. వాహన ప్రమాద బీయా కేసులో రూ.85 లక్షలు పరిహారాన్ని చెల్లించామన్నారు.
News July 5, 2025
గంజాయిని రూపుమాపేందుకు కృషి: సూర్యాపేట ఎస్పీ

గంజాయిని రూపుమాపేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తోందని SRPT జిల్లా SP నరసింహ అన్నారు. శనివారం కోదాడ మండలం దొరకుంట శివారులో గంజాయిని విక్రయిస్తూ పోలీసులకు చిక్కిన నిందితులు అడప రాకేశ్, వనపర్తి సాయిలును మీడియా ముందు ప్రవేశపెట్టి మాట్లాడారు. వీరి వద్ద నుంచి రూ.2.8 లక్షల విలువైన 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితులను పట్టుకున్న సీఐ రజిత రెడ్డి, రూరల్ పోలీసులను SP అభినందించారు.