News April 9, 2025
వెంకటగిరిలో టెన్షన్.. టెన్షన్

తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ ఛైర్‌పర్సన్ నక్కా భానుప్రియపై ఇవాళ అవిశ్మాస తీర్మానం జరగనుంది. అధికారులు 144 సెక్షన్ అమలుతో పక్కాగా ఏర్పాట్లు చేశారు. మొత్తం 25 వార్డుల్లో వైసీపీనే గెలవగా ఎన్నికలకు ముందు ముగ్గురు టీడీపీలో చేరారు. మరికొందరు భానుప్రియపై అసంతృప్తిగా ఉన్నారు. టీడీపీ సాయంతో భానుప్రియను కుర్చీ దింపడానికి మాజీ మున్సిపల్ ఛైర్మన్ దొంతు శారద ప్రయత్నిస్తుండగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Similar News
News November 15, 2025
కామారెడ్డి జిల్లా ఉపాధి అధికారిగా కిరణ్ కుమార్

జిల్లా ఉపాధి అధికారిగా కిరణ్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలసి పూలమొక్క అందించారు. పదవి బాధ్యతలను సక్రమంగా నిర్వహించి సమస్యలను తీర్చాలని కలెక్టర్ సూచించారు.
News November 15, 2025
రాజకీయాలు, కుటుంబానికి గుడ్‌బై: లాలూ కూతురు

బిహార్ మాజీ సీఎం, RJD పార్టీ ప్రెసిడెంట్ లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాలతో పాటు కుటుంబంతో బంధాన్ని తెంచుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. సంజయ్ యాదవ్, రమీజ్ పార్టీ నుంచి వెళ్లిపోమని తనతో చెప్పారని, మొత్తం నింద తానే తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో రోహిణి తన తండ్రి లాలూకు కిడ్నీ దానం చేసిన విషయం తెలిసిందే.
News November 15, 2025
తండ్రయిన రాజ్‌కుమార్

బాలీవుడ్ స్టార్ కపుల్ రాజ్‌కుమార్ రావు-పత్రలేఖ తల్లిదండ్రులయ్యారు. ఇవాళ వారి నాలుగో వివాహ వార్షికోత్సవం రోజునే ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్, పలువురు నటీనటులు శుభాకాంక్షలు తెలిపారు. 2010లో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రాజ్.. స్త్రీ2 చిత్రంతో ఇండస్ట్రీ హిట్ సాధించిన విషయం తెలిసిందే. పత్రలేఖ కూడా పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు.


