News November 4, 2024
వెంకటగిరి: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం
బాలాయపల్లి మండలంలో మరో అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. మండంలోని ఓ గ్రామంలో ఐదేళ్ల చిన్నారిపై 9వ తరగతి చదువుతున్న బాలుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. చిన్నారి గట్టిగా కేకలు వేసింది. దీంతో అక్కడికి చేరకున్న చిన్నారి బంధువులను చూసి నిందితుడు పరారయ్యాడు. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Similar News
News December 27, 2024
నెల్లూరు VR లా కాలేజీలో రెండు వర్గాలు పరస్పర దాడులు
నెల్లూరులోని VR లా కాలేజీలో రెండు వర్గాలు పరస్పర భౌతిక దాడులకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. దీంతో నెల్లూరు లా కాలేజీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓ విద్యార్థినిపై వేధింపులే ఈ ఘర్షణకు కారణం అని తెలుస్తోంది. లా విద్యార్థులపై చెన్నై నుంచి వచ్చిన రౌడీలు దాడికి పాల్పడడం గమనార్హం. ఈ ఘటనపై నెల్లూరు ఒకటో నగర పోలీస్ స్టేషన్లో విద్యార్థులు ఫిర్యాదు చేశారు.
News December 27, 2024
నెల్లూరు: మరి కాసేపట్లో జిల్లా వ్యాప్తంగా వైసీపీ పోరుబాట
కూటమి ప్రభుత్వం కరెంట్ చార్జీల బాదుడుపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఇవాళ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోరుబాట కార్యక్రమాలు చేపడుతున్నట్లు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. సామాన్యులపై వేలకోట్లు భారం మోపిన కూటమి సర్కార్‌పై నిరసన స్వరం వినిపించేలా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి వైసీపీ కార్యకర్తలు, నాయకులు తరలిరావాలని కోరారు.
News December 27, 2024
నెల్లూరు: జీజీహెచ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా మహేశ్వర్ బాధ్యతలు
నెల్లూరు జిల్లా సర్వజన ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ అధికారిగా గురువారం మహేశ్వర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నూతన ఏవోకు ఆసుపత్రి పర్యవేక్షకులు సిద్ధనాయక్, అభివృద్ధి కమిటీ సభ్యులు బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రి అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మంచి సౌకర్యాల కల్పనలో ముందు ఉంటామన్నారు.