News September 21, 2024

వెంకటగిరి జనసేన ఇన్‌ఛార్జ్‌పై వేటు

image

వెంకటగిరి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ గూడూరు వెంకటేశ్వర్లపై క్రమశిక్షణ చర్యలు చేపడుతూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 30వ తేదీలోపు ఆయనపై ఉన్న ఆరోపణలపై సంజాయిషీ ఇవ్వాలని కోరారు. అప్పటి వరకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. జనసేన పార్టీ కాన్ ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్ వేములపాటి అజయ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణం.

Similar News

News November 3, 2025

తుప్పు పడుతున్న సబ్ మిషన్ ప్రాజెక్ట పరికరాలు

image

ఉదయగిరి మండలంలోని గండిపాలెం జలాశయ సమీపంలో సుమారు ఏడు కోట్ల రూపాయలతో నిర్మించిన రాజీవ్ టెక్నాలజీ సబ్మిషన్ ప్రాజెక్ట్ మంచినీటి పథక యంత్ర పరికరాలు తుప్పుపడుతున్నాయి. దీంతో ఫ్లోరిన్ రహిత తాగునీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్వచ్ఛమైన తాగునీటి కోసం ప్రజలు వాటర్ ప్లాంట్లపై ఆధారపడి తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్వందించాలని కోరుతున్నారు.

News November 2, 2025

మైపాడు బీచ్‌లో ముగ్గురు ఇంటర్ విద్యార్థుల మృతి

image

మైపాడు బీచ్‌లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. బీచ్‌లో స్నానానికి దిగి ఇంటర్ విద్యార్థులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను హుమయూన్, తాజిన్, ఆదిల్‌గా పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 2, 2025

గొలగముడి: లడ్డూ కౌంటర్ 10 గంటలకు ముందే క్లోజ్

image

వెంకటాచలం మండలం గొలగముడి వెంకయ్య స్వామి గుడికి జిల్లాలోనే మంచి గుర్తింపు ఉంది. ఇక్కడకు ఒక్క శనివారమే సుమారు 10 వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. కానీ అక్కడ భక్తులు ఎంతో భక్తితో తీసుకొనే లడ్డూ ప్రసాదం అందరికి అందడం లేదు. కనీసం రాత్రి 10 గంటలు కాకముందే కౌంటర్ మూసేశారు. దీంతో భక్తులు ప్రసాదం తీసుకోకుండానే నిరాశ చెందుతున్నారు. పలుమార్లు ఇలానే జరుగుతుందని భక్తులు వాపోతున్నారు.