News October 31, 2025

వెంకటగిరి: బాలికపై లైంగిక దాడి.. మారుతండ్రికి జీవిత ఖైదు

image

బాలికపై మారు తండ్రి పలుమార్లు లైంగిక దాడి చేసిన కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడు సర్వేపల్లి అంజయ్యకు జీవిత ఖైదుతో పాటు రూ.40 వేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. వెంకటగిరి బంగారు పేట అరుంధతి పాలేనికి చెందిన సర్వేపల్లి అంజయ్యకు ఓ వివాహితతో పరిచయం ఏర్పండి. ఈ క్రమంలో ఆమెతో ఉంటూ మహిళ 15 ఏళ్ల కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి 2021 జులై 19న కేసు నమోదైంది.

Similar News

News October 31, 2025

అనకాపల్లి: ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవం

image

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీలు దేవప్రసాద్, మోహన్ రావు పటేల్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. దేశ సమగ్రత, ఐక్యత, భద్రతను కాపాడడానికి కృషి చేస్తామని పోలీసులతో ప్రతిజ్ఞ చేయించారు.

News October 31, 2025

పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌గా ప్రేమ్ సాగర్ రావు

image

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. క్యాబినెట్ హోదా కల్పిస్తూ అన్ని సౌకర్యాలు సమకూరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఆయనకు క్యాబినెట్ హోదా గల ఛైర్మన్ పదవి లభించడం పట్ల నియోజకవర్గంలోని పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

News October 31, 2025

మెదక్‌లో ఇందిరాగాంధీపై పోటీ చేసిందెవరంటే..?

image

ఇందిరాగాంధీపై దివంగత కాంగ్రెస్ నేత, ప్రస్తుత సీఎం మామ అయిన సూదిని జైపాల్ రెడ్డి జనతాపార్టీ తరఫున పోటీ చేశారు. జైపాల్ రెడ్డికి ఆ ఎన్నికల్లో 82,453 ఓట్లు రాగా.. ఇందిరకు 3,01,577 ఓట్లు వచ్చాయి. అనంతరం జైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జైపాల్ రెడ్డితో పాటు ఇందిరాగాంధీపై పీవీ నరసింహారావు తనయుడు పీవీ రాజేశ్వరావు, తెలంగాణ ఉద్యమ నాయకుడు కేశవ్ రావు జాదవ్, గణిత మేధావి శకుంతలా దేవీ సైతం పోటీ చేశారు.