News March 21, 2025
వెంకటగిరి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

గూడూరు నుంచి వెంకటగిరి వైపు వస్తున్న కారు వర్ధనంపాలెం సమీపంలో రోడ్డు పక్కన వడ్లను బస్తాల్లో నింపుతున్న కూలీలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వారిలో రత్నమ్మ(55) అనే మహిళ మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెంకటగిరి ఎస్ఐ సుబ్బారావు తెలిపారు.
Similar News
News November 12, 2025
నేడు విచారణకు ప్రకాశ్ రాజ్

బెట్టింగ్ యాప్స్ కేసులో నోటీసులు అందుకున్న నటుడు ప్రకాశ్ రాజ్ ఇవాళ CID విచారణకు హాజరుకానున్నారు. నిన్న విజయ్ దేవరకొండను విచారించిన అధికారులు.. బ్యాన్డ్ యాప్స్‌ను ఎలా ప్రమోట్ చేశారు? ఏ ఒప్పందాలు జరిగాయి? రెమ్యునరేషన్ ఎంత? తదితర అంశాలపై గంట పాటు ప్రశ్నించారు. ఇందుకు తాను చట్టబద్ధంగా A23 యాప్‌ను ప్రమోట్ చేశానని విజయ్ పలు ఆధారాలు సమర్పించారు.
News November 12, 2025
ఆస్పత్రి నుంచి వస్తుండగా యాక్సిడెంట్.. తల్లీకొడుకు మృతి

కోయిలకొండ మండలంలోని తమ్మాయిపల్లి సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముత్యాలమ్మ, ఆమె కుమారుడు బలరాం మృతి చెందారు. వీరన్నపల్లికి చెందిన వీరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించుకుని తిరిగి వస్తుండగా కారు ఢీకొట్టింది. వారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 12, 2025
2.50 కేజీల గోల్డ్ చోరీ.. దొంగలు తిరుపతికి పరార్?

చెన్నై కొరకు పేటై ప్రాంతంలో 2.50 కిలోల బంగారం దొంగతనం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పేటై ఎస్ఐ ఇద్దరు నిందితులు బాపన్ రాయ్, నారాయన్ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో వారు నాగలాపురం మీదగా తిరుపతికి వచ్చినట్లు తెలిపారు. అక్కడి పోలీసుల సమాచారంతో తిరుపతి పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానితులు కనిపిస్తే తమకు సమాచారం(8099999977) ఇవ్వాలని కోరారు.


