News August 16, 2025
వెంకటగిరి సబ్ DFOగా కొల్లూరు వెంకట శ్రీకాంత్

ఏపీ కేడర్-2023 బ్యాచ్‌కు చెందిన IFS అధికారులకు ఏపీ ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. తిరుపతి జిల్లా వెంకటగిరి సబ్ DFOగా కొల్లూరు వెంకట శ్రీకాంత్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ CS కె.విజయానంద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. కాగా బాపట్లకు చెందిన కొల్లూరు వెంకట శ్రీకాంత్ 2023లో విడుదలైన IFS ఫలితాల్లో ఆల్ ఇండియాలో టాప్ 1 ర్యాంక్ సాధించారు. మొదటి పోస్టింగ్ వెంకటగిరిలో సబ్ DFOగా పోస్టింగ్ ఇచ్చారు.
Similar News
News August 16, 2025
అమ్మాయిలకు ఫ్రీగా స్కూటీలు.. కేంద్రం ఏమందంటే?

కేంద్ర ప్రభుత్వం దేశంలోని మహిళలు, యువతులకు ఉచితంగా స్కూటీలను అందిస్తుందని, అప్లై చేసుకోండని జరుగుతున్న ప్రచారాన్ని ‘PIBFactCheck’ ఖండించింది. కేంద్రం ఇలాంటి ‘ఫ్రీ స్కూటీ స్కీమ్’ను తీసుకురాలేదని స్పష్టం చేసింది. ఇలాంటి విషయాలను ఎవరైనా షేర్ చేస్తే ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్స్‌లో చెక్ చేసి నిర్ధారించుకోవాలని సూచించింది. ఇతరులకు మీరు షేర్ చేసే ముందు నిజాన్ని తెలుసుకోవాలని కోరింది.
News August 16, 2025
ఏలూరు: గౌతు లచ్చన్నకు నివాళులర్పించిన కలెక్టర్

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జీవితం అందరికీ ఆదర్శనీయమని కలెక్టర్ వెట్రిసెల్వి పేర్కొన్నారు. ఏలూరు కలెక్టరేట్‌లో శనివారం ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి, లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లచ్చన్న సాహసానికి, కార్యదక్షతకు మెచ్చి ప్రజలు ‘సర్దార్’ బిరుదు ఇచ్చారని కలెక్టర్ తెలిపారు.
News August 16, 2025
రెబ్బెన: బాల్ బ్యాడ్మింటన్ జిల్లా జట్టు ఎంపిక

ఈ నెల 23 నుంచి జరిగే రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలకుగానూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాల, బాలికల జట్టును శనివారం గోలేటిలో ఎంపిక చేసినట్లు బాల్ బ్యాడ్మింటన్ జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తిరుపతి, సంయుక్త కార్యదర్శి వెంకటేష్, ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారు జాతీయ స్థాయికి ఎంపికవుతారని వివరించారు.