News February 5, 2025

వెంకటగిరి: APSP హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి

image

వెంకటగిరి ( వల్లివేడు )లోని APSP 9th బెటాలియన్‌లో పనిచేస్తున్న 2013 బ్యాచ్ హెడ్ కానిస్టేబుల్ మగ్గం నరసయ్య (35) బుధవారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు. ఆయన స్వగ్రామం పెళ్లకూరు మండలం జీలపాటూరు. ఆయనకు ఇటీవలే వివాహమయ్యింది. ఇతని మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటుతో మృతి చెందడం పట్ల బెటాలియన్‌లోని తోటి సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నారు.

Similar News

News February 6, 2025

నాణ్యమైన కాఫీకి అధిక ధరలు చెల్లించండి: కలెక్టర్

image

నాణ్యమైన కాఫీని సరఫరా చేసిన రైతులకు అధిక ధరలు చెల్లించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఏఈవోలు, హర్టీకల్చర్ కన్సల్టెంట్లు, ఫీల్డ్ కన్సల్టెంట్లతో సమావేశం నిర్వహించారు. చింతపల్లి, జీకేవీధి మండలాల్లో ఆర్గానిక్ కాఫీ పండిస్తున్న రైతుల వద్ద ఉన్న నిల్వలను గుర్తించి సేకరించాలన్నారు. గిరిజన రైతులకు అంతర్జాతీయ మార్కెట్ ధరలను చెల్లించాలని ఆదేశించారు.

News February 6, 2025

ఆదిలాబాద్‌లో 100 రోజుల TB క్యాంపెనింగ్

image

జిల్లాలో వందరోజుల టీబీ క్యాంపెనింగ్‌లో వల్నరబుల్ పాపులేషన్స్‌కి వాహనాల ద్వారా ఎక్స్రే రేకు పంపాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఎపిడెమిక్ సెల్, ఆర్బీఎస్కే వాహనాలను 100 రోజుల శిబిరానికి వినియోగించుకోవాలన్నారు. అర్బన్ స్లమ్స్, 50 రోజుల్లో శిబిరాలు జరగని గ్రామాల్లో శిబిరాన్ని నిర్వహించాలని మెడికల్ ఆఫీసర్లకు సూచించారు. టీబీ లక్షణాలు కలిగిన వారిని గుర్తించాలన్నారు.

News February 6, 2025

MBNR: జూరాలకు నీటిని విడుదల చేయండి.!

image

క‌ర్నాట‌క‌లోని నారాయ‌ణ‌పూర్ డ్యాం నుంచి 5 టీఎంసీల‌ నీటిని విడుద‌ల చేసి ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా సాగు, తాగునీటి అవ‌స‌రాలు తీర్చాల‌ని ఆ రాష్ట్ర సీఎం సిద్దారామ‌య్య‌ను మంత్రులు జూప‌ల్లి కృష్ణారావు, శ్రీధ‌ర్ బాబు కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌ రెడ్డి, శ్రీహ‌రి, మధుసూదన్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌లు మంగ‌ళ‌వారం బెంగ‌ళూర్‌లో సీఎంను క‌లిసి వినతి పత్రం అందించారు.

error: Content is protected !!