News September 27, 2024

వెంకటరెడ్డికి OCT 10 వరకు రిమాండ్ విధింపు

image

గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డికి విజయవాడ కోర్టు అక్టోబర్ 10 వరకు రిమాండ్ విధిస్తూ శుక్రవారం ఆదేశాలిచ్చింది. గనుల కేటాయింపులలో వెంకటరెడ్డి పలు సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చారంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో వెంకటరెడ్డిని A1గా అధికారులు చేర్చారు. కాగా గత రాత్రి హైదరాబాద్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విజయవాడ GGHలో వైద్యపరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టారు.

Similar News

News December 15, 2025

ముస్తాబాద్: యంత్రాలతో వరిగడ్డి కట్టలు.. రూ. 40 వేలు ఆదా

image

ముస్తాబాద్ ప్రాంతంలో వరి నూర్పిడి తర్వాత పొలాల్లోని ఎండుగడ్డిని తగులబెట్టడం వల్ల కాలుష్యం, భూసారం నష్టం జరుగుతున్నప్పటికీ 75 శాతం మంది రైతులు అదే పద్ధతి కొనసాగిస్తున్నారు. అయితే, కొందరు రైతులు యంత్రాల సహాయంతో వరిగడ్డిని కట్టలుగా చేసి, పశుగ్రాసంగా వినియోగిస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా రైతులు సుమారు రూ.40 వేల వరకు ఖర్చు ఆదా చేసుకుంటున్నారు. ఇది పర్యావరణానికి, రైతులకు లాభదాయకమని అధికారులు పేర్కొన్నారు.

News December 15, 2025

కృష్ణా ఫెన్సింగ్‌కు కాంస్య పతకాలు

image

గుంటూరు జిల్లా వెనిగండ్లపాడులో జరిగిన అంతర జిల్లాల ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కృష్ణా జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. అండర్-19 విభాగంలో బాలికల శాబర్ జట్టు, బాలుర ఇప్పి జట్టు, బాలుర ఫోయిల్ జట్లు కాంస్య పతకాలను సాధించాయి. కృష్ణా జిల్లా ఫెన్సింగ్ శిక్షకులు ధనియాల నాగరాజు విజేతలను అభినందనలు తెలిపారు.

News December 14, 2025

రేపు గుడివాడకు రానున్న వందే భారత్

image

వందే భారత్ రైలు సేవలు రేపటి నుంచి గుడివాడ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. చెన్నై-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు గుడివాడలో కూడా ఆగనుంది. చెన్నై-విజయవాడ వందే భారత్ (20677) రైలును నర్సాపురం వరకు రైల్వే శాఖ పొడిగించింది. అయితే నర్సాపూర్, మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్, బెంగళూరుకు వందే భారత్ రైలు సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.