News April 30, 2024

వెంకటరెడ్డి పల్లిలో ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల గల్లంతు

image

కలువాయి మండలం వెంకటరెడ్డి పల్లి బ్రిడ్జి వద్ద ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. నీట మునిగిన యువకులు పాతలపల్లి గ్రామానికి చెందిన మిట్టమల్ల వంశీ(28), పెంచల నరసింహులు(20) గా గుర్తించారు. వంశీ మృతదేహాన్ని బయటకు తీసిన స్థానికులు, పెంచల నరసింహులు మృతదేహం కోసం ఈతగాళ్లు, స్థానికులు, బంధువులు గాలిస్తున్నారు. సంఘటన స్థలం వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు శోకసవద్రంలో మునిగి పోయారు.

Similar News

News April 14, 2026

నెల్లూరు: వడదెబ్బతో వ్యక్తి మృతి

image

ఉదయగిరిలోని దాసరపల్లిలో వడదెబ్బ తగిలి షేక్. మౌలాలి (65) మృతి చెందాడు. పొలానికి నీళ్లు కట్టడానికి 10 గంటల సమయంలో వెళ్లిన మౌలాలి పొలం పనులు ముగించుకొని ఇంటికి చేరుకున్నాడు. కొద్దిసేపటికి స్పృహ తప్పి పడిపోయాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యాధికారులు వెల్లడించారు.

News April 14, 2026

అంబేడ్కర్‌కు నివాళులర్పించిన నెల్లూరు కలెక్టర్

image

అంబేడ్కర్ జయంతి సందర్భంగా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. దేశానికి భారత రాజ్యాంగాన్ని ఒక దిక్సూచిగా రచించిన మహనీయుడు అని కొనియాడారు. ఆయన దేశానికి అందించిన రాజ్యాంగం నేటికీ కొనసాగించడం అభినందనీయమన్నారు.

News April 14, 2026

ఆత్మకూరు: ఆటోలోనే డ్రైవర్ మృతి

image

ఆత్మకూరు శివారులోని నెల్లూరు పాలెం వద్ద సోమవారం ఆటోలోనే డ్రైవర్ జమీర్(57) మృతి చెందారు. టిట్కో గృహాల్లో నివసించే ఆయన ఉదయం ఇంటి నుంచి వెళ్లిన తర్వాత నెల్లూరు పాలెం వద్ద ఆటోలోనే విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. అనారోగ్యం లేదా ఎండ తీవ్రత వల్ల మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.