News March 24, 2025
వెంకటాపురం: లారీ ఢీకొని ఒకరు మృతి

వెంకటాపురంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఉప్పెడు వీరాపురం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఇసుక లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. మృతుడు వీరాపురం గ్రామానికి చెందిన గోపాల్‌గా గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News March 29, 2025
ముగిసిన శిథిలాల తొలగింపు

భద్రాచలంలోని ఐదంతస్తుల భవనం కూలిన ఘటనలో శిథిలాల తొలగింపు శుక్రవారం ముగిసింది. శిథిలాల కింద చిక్కుకున్న కామేశ్వరరావు, ఉపేందర్ మృతదేహలను బయటకు తీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సుమారు 42గంటల పాటు సహాయక బృందాలు, అధికారులు శిధిలాల తొలగింపు ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ ఘటనలో ఇంటి యజమాని శ్రీపతి దంపతులపై కేసు నమోదు చేసినట్లు సీఐ రమేష్ తెలిపారు.
News March 29, 2025
43 వసంతాల ‘తెలుగుదేశం’

తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్టీఆర్ 1982 మార్చి 29న టీడీపీని స్థాపించారు. 9 నెలల్లోనే 294 అసెంబ్లీ సీట్లలో 202 గెలుచుకుని పార్టీ అధికారంలోకి వచ్చింది. రూ.2కే కిలో బియ్యం, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు వంటి కొత్త పథకాలతో పలు సంస్కరణలు తీసుకొచ్చింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు పది సార్లు ఎన్నికలు జరగగా.. ఆరు సార్లు అధికారంలో, నాలుగు సార్లు ప్రతిపక్షంలో ఉంది.
News March 29, 2025
‘జలియన్‌వాలా బాగ్’పై భారత్‌కు క్షమాపణలు చెప్పాలి: UK ఎంపీ

జలియన్‌వాలా బాగ్ ఘటనపై UK సర్కారు భారత్‌కు క్షమాపణలు చెప్పాలని ఆ దేశ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ డిమాండ్ చేశారు. ‘2019లో అప్పటి పీఎం థెరెసా ఆరోజును గుర్తించారు కానీ క్షమాపణలు చెప్పలేదు. బ్రిటిష్ సామ్రాజ్య చరిత్రలోనే ఈ ఘటన మాయని మచ్చ’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 13, 1919న జలియన్‌వాలా బాగ్‌లో ఈస్టిండియా సర్కారు ఘోర మారణకాండకు పాల్పడింది. వేలాదిమంది అమాయక పౌరుల్ని మైదానంలోనే కాల్చి చంపించింది.