News October 4, 2025
వెంకటాపూర్: 60 ఏళ్లుగా ఆ పార్టీ మద్దతుదారే సర్పంచ్..!

వెంకటాపూర్ మండలం రామానుజాపూర్ గ్రామ పంచాయతీకీ ఓ ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో నేటి వరకు కాంగ్రెస్ మద్దతుదారే సర్పంచ్‌గా గెలుపొందడం విశేషం. ప్రత్యర్థి పార్టీల నుంచి ఎక్కువ మంది పోటీలో ఉండటం, సర్పంచ్ అభ్యర్థిని ఎన్నుకోవడంలో ఒక సామాజిక వర్గం కీలకంగా వ్యవహరించడం కారణమని స్థానికులు చెబుతున్నారు. సర్పంచ్ అభ్యర్థుల మధ్య పోటీ మాత్రం నువ్వా? నేనా? అన్నట్లు ఉంటుందని అంటున్నారు.
Similar News
News October 5, 2025
నిజాసాగర్ 6గేట్ల నుంచి 51,761 క్యూసెక్కులు విడుదల

నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. శనివారం సాయంత్రం 51,761 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు 6 వరద గేట్లను ఎత్తి 51,762 క్యూసెక్కుల నీటిని మంజీరాకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ అక్షయ్ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 17.687 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు వెల్లడించారు.
News October 5, 2025
ఆలస్యం చేస్తే ఊరుకోను.. ట్రంప్ వార్నింగ్

తన ప్రకటనపై హమాస్ వేగంగా స్పందించాలని అమెరికా అధ్యక్షుడు <<17906657>>ట్రంప్ హెచ్చరించారు<<>>. ‘బందీలను విడుదల చేసేందుకు, శాంతి ఒప్పందాన్ని అమలు చేసేందుకు తాత్కాలికంగా బాంబింగ్ ఆపినందుకు ఇజ్రాయెల్‌ను అభినందిస్తున్నా. హమాస్ వైపు నుంచి ఏదైతే జరుగుతుందని అందరూ భావిస్తున్నారో అలాంటి ఆలస్యాన్ని నేను సహించను. బందీలను విడుదల చేసే ప్రక్రియను త్వరగా పూర్తి చేయండి. అందరితో న్యాయంగా వ్యవహరిస్తాం’ అని SMలో పోస్ట్ చేశారు.
News October 5, 2025
జీఎస్టీతో పరిశ్రమలకు లబ్ధి: కలెక్టర్

భారతదేశంలో GST సంస్కరణల అమలుతో జౌళి, విద్యుత్, చేనేత పరిశ్రమలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ అన్నారు. జీఎస్టీ 2.0పై నెల రోజులపాటు జరిగే అవగాహన సదస్సులో భాగంగా ‘సూపర్ సేవింగ్స్’ అంశాలపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. జిల్లా కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను సేల్స్ టాక్స్, కమర్షియల్ టాక్స్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.