News March 13, 2025

వెంకటాపూర్: Way2Newsకు స్పందన

image

“రామప్ప ప్రధాన కాలువకు బుంగ ” శీర్షికన ఈనెల 10న Way2Newsలో ప్రచురితమైన కథనానికి ములుగు జిల్లా నీటిపారుల శాఖ అధికారులు స్పందించారు. వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప ప్రధాన కాలువ ఐన ఒగరు కాలువ గండిని బుధవారం పూడ్చివేశారు. అనంతరం ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. దీంతో ఆయకట్టు రైతులు Way2Newsకు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News November 3, 2025

HYD: మృతులకు రూ.7 లక్షల ఎక్స్‌గ్రేషియా: మంత్రి

image

చేవెళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన బస్సు ప్రమాదం దురదృష్టకరమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.7 లక్షలు ప్రకటిస్తూ, బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే CM రేవంత్ రెడ్డి స్పందించి మంత్రులు, అధికారులను అప్రమత్తం చేశారని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్, RR జిల్లా కలెక్టర్ C.నారాయణ రెడ్డి ప్రమాద స్థలానికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించారు.

మంచిర్యాల: రైలు కింద పడి వ్యక్తి మృతి

image

మంచిర్యాలలో విషాదం చోటుచేసుకుంది. రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించినట్లు వారు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.