News June 3, 2024
వెంకట్రామిరెడ్డి.. రఘునందన్.. నీలం మధు.. వీరిలో మన MP ఎవరు?

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రేపే వెలువడనుండడంతో మెదక్ ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్ నుంచి నీలం మధు, BJP నుంచి రఘునందన్ రావు పోటీలో ఉన్నారు. కాగా మెదక్‌లో BRS, కాంగ్రెస్ మధ్య టఫ్ పైట్ ఉందని సర్వేల్లో వెల్లడవగా త్రిముఖ పోటీ ఉంటుందని స్థానిక నేతలు అంటున్నారు. KCR, హరీశ్ రావు సొంత ఇలాకా కావడంతో ఈ స్థానం ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Similar News
News February 20, 2026
మెదక్: 22న బేస్ లైన్ పరీక్షలు

ఓపెన్ స్కూల్ అభ్యాసకులకు బేస్ లైన్ పరీక్షలు ఈనెల 22న నిర్వహించనున్నట్లు డీఈవో విజయ తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గల అధ్యయన కేంద్రాల కో-ఆర్డినేటర్లు ఈ విషయం విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. అభ్యాసకులు తప్పకుండ పరీక్షలకు హాజరయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వివరాలకు ఎస్.వెంకటస్వామి కో ఆర్డినేటర్ 8008403635 ఫోన్ చేయాలని సూచించారు.
News February 19, 2026
బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత: అదనపు కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణలో ‘బాల్య వివాహ ముక్త్ భారత్’ 100 రోజుల ప్రత్యేక ప్రచార వాహనాన్ని జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
News February 19, 2026
మెదక్: ‘ఉత్తమ అధికారులుగా పేరు తెచ్చుకోవాలి’

మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావును గ్రూప్-1 శిక్షణ అధికారులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ వారికి విధి నిర్వహణపై పలు సూచనలు చేశారు. అధికారులు క్రమశిక్షణ, నిజాయితీతో పాటు మానవత్వంతో ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ ఉత్తమ అధికారులుగా పేరు తెచ్చుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు.


