News February 22, 2025
వెంకోజిపాలెం వైపు ట్రాఫిక్ డైవర్షన్

విశాఖలో ఇసుకతోట జాతీయ రహదారిపై గ్రూప్-2 అభ్యర్థులు శనివారం ధర్నాకు దిగారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపడుతున్నారు. కొన్ని వాహనాలను వెంకోజిపాలెం మీదుగా ఎంవీపీ కాలనీ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు దారి మళ్ళించారు. మరికొన్ని వాహనాలను హెచ్‌బి కాలనీ మీదుగా సీతమ్మధార వైపు దారి మళ్ళించారు.
Similar News
News February 23, 2025
మిస్సింగ్ కేసులను ఛేదించిన విశాఖ పోలీసులు

విశాఖ టూ టౌన్ స్టేషన్ పరిధిలో విశాఖ, విజయనగరానికి చెందిన రెండు మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మిస్సింగ్ కేసులపై టూ టౌన్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేసి గుర్తించారు. ఇద్దరు మహిళలను శనివారం వారి కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. రెండు మిస్సింగ్ కేసులను ఛేదించిన టూ టౌన్ పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.
News February 23, 2025
దువ్వాడ మీదుగా రెండు ప్రత్యేక రైళ్లు

దువ్వాడ మీదుగా సంబల్ పూర్ – ఈరోడ్ (08311/12), భువనేశ్వర్ – యస్వంత్ పూర్ (02811/12)రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. ప్రయాణీకుల రద్దీని నియంత్రించేందుకు మార్చి 12 నుంచి ఏప్రిల్ 30 వరకు ప్రతి బుధవారం సంబల్‌పూర్ – ఈరోడ్, మార్చ్ 1నుంచి ఏప్రిల్ 26వరకు ప్రతి శనివారం భువనేశ్వర్ – యస్వంత్ పూర్ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వెల్లడించారు.. ప్రయాణికులు గమనించాలన్నారు.
News February 22, 2025
అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు: విశాఖ సీపీ

విశాఖ నగర సీపీ శంఖబ్రత బాగ్చి శనివారం కమిషనర్ కార్యాలయంలో నెలవారి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. నగరంలో యాక్టీవ్‌గా ఉన్న రౌడీ షీటర్లపై పెడుతున్న నిఘా చర్యలపై ఆరా తీశారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా పూర్తిగా నివారించాలని, గంజాయి ఎక్కడా ఉండరాదని ఆదేశించారు. రాత్రి పూట నిఘా పటిష్టం చేయాలనీ, ఉమెన్ సేఫ్టీకి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.