News November 10, 2025

‘వెంటనే తొలగిస్తున్నాం’.. CEO సహా ఉద్యోగులకు HR మెయిల్!

image

HR డిపార్ట్‌మెంట్ చేసిన పొరపాటు గురించి ఓ ఉద్యోగి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘మా కంపెనీ ఆఫ్‌బోర్డింగ్ ఆటోమేషన్ టూల్‌ను టెస్ట్ చేస్తోంది. లైవ్ మోడ్ నుంచి టెస్ట్ మోడ్‌కు మార్చడాన్ని మర్చిపోయింది. దీంతో ‘మీ చివరి పని దినం వెంటనే అమల్లోకి వస్తుంది’ అని CEO సహా 300 మందికి ఈమెయిల్స్ వచ్చాయి. అయితే తప్పు తెలుసుకుని తర్వాత మరో మెసేజ్ చేసింది. ఎవరినీ తొలగించలేదని చెప్పింది’ అని రెడిట్‌లో రాసుకొచ్చాడు.

Similar News

News November 10, 2025

నిన్న అయ్యప్ప పూజకు హాజరు.. అంతలోనే..

image

TG: కవి అందెశ్రీ మరణాన్ని సాహితీప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్న సమాచార హక్కు కమిషనర్ అయోధ్య రెడ్డి ఇంట్లో నిర్వహించిన అయ్యప్ప పూజకు ఆయన హాజరయ్యారు. రాత్రి కూడా బాగానే ఉన్నారని, భోజనం చేసి నిద్రపోయారని కుటుంబీకులు తెలిపారు. ఉదయం నిద్రలేపగా స్పందించలేదని, వెంటనే గాంధీకి తరలించినట్లు చెప్పారు. అయితే అప్పటికే అందెశ్రీ గుండెపోటుతో మరణించారని వైద్యులు ధ్రువీకరించారు.

News November 10, 2025

కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్ భేటీ

image

సీఎం చంద్రబాబు అధ్యక్షత ఏపీ క్యాబినెట్ భేటీ కొనసాగుతోంది. సుమారు 70 అంశాలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చలు జరుపుతోంది. క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ, ఏపీ నైబర్‌హుడ్ వర్క్‌స్పేస్ పాలసీ, ఐటీ శాఖకు చెందిన 10కి పైగా అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటు సహా సీఆర్డీఏ, పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖల్లో పనుల పాలనా అనుమతులపై చర్చిస్తోంది.

News November 10, 2025

డాక్టర్ ఇచ్చిన టిప్.. 360 కిలోల ఆర్డీఎక్స్ స్వాధీనం

image

భారీ ఉగ్ర కుట్రను జమ్మూకశ్మీర్‌ పోలీసులు భగ్నం చేశారు. హరియాణాలోని ఫరీదాబాద్‌లో 360 కిలోల ఆర్డీఎక్స్, AK-47 రైఫిల్, పెద్దమొత్తంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనంతనాగ్‌(కశ్మీర్‌)లో అరెస్టయిన డాక్టర్ ఆదిల్ అహ్మద్ ఇచ్చిన సమాచారం ఆధారంగా అల్ ఫలా ఆస్పత్రిలో తనిఖీలు చేసి వీటిని కనుగొన్నారు. ఈ కేసులో మరో డాక్టర్ ముజామిల్ షకీల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.