News October 15, 2025
వెండర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం సక్సెస్: కలెక్టర్

14, 15వ తేదీల్లో కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వెండర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం విజయవంతమైందని కలెక్టర్ మహేశ్ కుమార్ బుధవారం తెలిపారు. 150 మంది కొనుగోలుదారులు, అమ్మకందారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇరు వర్గాల మధ్య సత్సంబంధాలు పెంచేందుకు ఈ కార్యక్రమం దోహదపడిందని కలెక్టర్ మహేశ్ కుమార్ పేర్కొన్నారు.
Similar News
News October 16, 2025
8th పే కమిషన్ సిఫార్సులు మరింత ఆలస్యం!

కేంద్ర ప్రభుత్వ 8th పే కమిషన్ సిఫార్సులు ఆలస్యం కావొచ్చు. కమిషన్‌ను కేంద్రం JANలో ప్రకటించినా విధివిధానాలు తేల్చలేదు. పదేళ్లకోసారి ఉద్యోగుల జీతాలు సవరించాలి. 7th పే కమిషన్ 2014లో ఏర్పాటు కాగా సిఫార్సులు 2016లో అమల్లోకొచ్చాయి. ప్రస్తుత కమిషన్ సిఫార్సులు 2026లో అమల్లోకి రావాలి. కానీ 2027లో కూడా అమలు కాకపోవచ్చని ‘కొటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్’ పేర్కొంది. ఫిట్మెంటు 1.8xగా ఉండొచ్చని అంచనా వేసింది.
News October 16, 2025
విశాఖలో ₹1,222 కోట్లతో లులు ప్రాజెక్టు

AP: విశాఖకు AI హబ్, డిజిటల్ డేటా సెంటర్ రానుండడంతో ‘లులు’ తన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఏర్పాటుకు రెడీ అవుతోంది. రూ.1,222 కోట్లతో హార్బర్ పార్కు వద్ద 13.74 ఎకరాల్లో వచ్చే ఈ ప్రాజెక్టులో హైపర్ మార్కెట్, ఫ్యాషన్ స్టోర్, లులు కనెక్ట్, ఫన్ టూర్ వంటివి ఉంటాయి. దీనికి ప్రభుత్వం పలు రాయితీలిస్తోంది. ఇటీవల క్యాబినెట్లో మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యంతరం తెలిపినా ప్రభుత్వం సవరించిన నిబంధనలకు ఓకే చెప్పింది.
News October 16, 2025
ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై జగిత్యాల కలెక్టర్ సమీక్ష

ఖరీఫ్ 2025–26 సీజన్‌లో 6,66,500 మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు ప్రణాళికపై కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ BS లత గురువారం రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రతి మిల్లు 100శాతం బ్యాంక్ గ్యారెంటీ సమర్పించాలని, లారీలు వెంటనే దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 423 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతుందని, నాణ్యతకు లోటు ఉన్న ధాన్యాన్ని వెంటనే సిబ్బందికి తెలియజేయాలని సూచించారు.