News December 15, 2025

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిపెట్టాలి: డీఈఓ

image

కంది మండలం ఉత్తరపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం సందర్శించారు. పాఠశాలలో బోధన, విద్యార్థుల అభ్యాస స్థాయిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విద్యార్థుల చేత పాఠ్యాంశాలను చదివించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఈఓ ఉపాధ్యాయులకు సూచించారు.

Similar News

News December 16, 2025

NSU ఘటనపై వీసీకి నోటీసులు ఇచ్చిన NCW

image

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విద్యార్థిని పట్ల జరిగిన లైంగిక వేధింపుల ఘటనపై తిరుపతి ఎంపీ గురుమూర్తి ఇచ్చిన ఫిర్యాదుపై జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి 15 రోజుల్లోపు కమీషన్‌కు సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఇటీవల మహిళా కమీషన్ సభ్యురాలు వర్సిటీలో విచారణ చేసిన విషయం తెలిసిందే.

News December 16, 2025

జగిత్యాల: బీడీ కార్మికురాలు.. ప్రథమ పౌరురాలు..!

image

బీడీలు చూడుతూ జీవనం సాగిస్తున్న ఓ మహిళ గ్రామానికి ప్రథమ పౌరురాలైంది. మల్యాల(M) గొర్రెగుండం గ్రామానికి చెందిన సుంకే అంజలి బీడీ కార్మికురాలు కాగా, ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలో నిలిచి సర్పంచిగా విజయం సాధించారు. అలాగే మండలంలోని మ్యాడంపెల్లి గ్రామానికి చెందిన గాతం అంజయ్య కూలీ పనులు చేస్తూ ఎన్నికల్లో పోటీచేసి సర్పంచ్ అయ్యారు. ప్రజలకు సేవ చేయాలనే వీరి సంకల్పం, శ్రమకు విజయం దాసోహం అయింది.

News December 16, 2025

ప్రొద్దుటూరు మున్సిపల్ ఉద్యోగి సస్పెన్షన్.!

image

ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓబులేసును సస్పెండ్ చేశారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. మున్సిపల్ చైర్ పర్సన్ సీసీగా, అజెండా క్లర్క్‌గా ఓబులేసు విధులు నిర్వహిస్తున్నాడు. పెట్రోల్ బంకులో జరిగిన అక్రమాలపై అక్కడి మేనేజర్ ప్రవీణ్‌పై కమిషనర్ చర్యలకు ఉపక్రమించారు. ఆ మేరకు ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపారు.