News December 10, 2025
వెబ్ కాస్టింగ్‌ను నిశితంగా పరిశీలించాలి: నిర్మల్ కలెక్టర్

ఎన్నికలు జరగనున్న పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటుచేసిన వెబ్ కాస్టింగ్‌ను నిశితంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ పర్యవేక్షణను ఆమె పరిశీలించి వెబ్ కాస్టింగ్ పర్యవేక్షణ విధులు నిర్వహిస్తున్న అధికారులకు పలు సూచనలు చేశారు.
Similar News
News December 14, 2025
మంచిర్యాల జిల్లాలో 21.52% పోలింగ్

మంచిర్యాల జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 21.52% ఓటింగ్ నమోదైంది. బెల్లంపల్లిలో 22.81శాతం, భీమిని 21.39, కన్నెపల్లి 23.33 శాతం, కాసీపేట్ 19.45, నెన్నెల్ 18.46, తాండూర్ 22.07, వేమనపల్లి 24.22 ఓటింగ్ నమోదైంది. ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు.
*జీపీ ఎలక్షన్ ఫలితాలకు Way2Newsను ఫాలో అవ్వండి.
News December 14, 2025
ISIS దాడిలో ముగ్గురు అమెరికన్ల మృతి.. ట్రంప్ వార్నింగ్

సెంట్రల్ సిరియాలో ఐసిస్ చేసిన దాడిలో ముగ్గురు అమెరికన్లు చనిపోయారు. వీరిలో ఇద్దరు సైనికులు, ఓ పౌరుడు ఉన్నారు. ఈ ఘటనపై US అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇది అమెరికా, సిరియాపై జరిగిన దాడి అని, బలమైన ప్రతీకారం ఉంటుందని హెచ్చరించారు. ఈ దాడితో దిగ్భ్రాంతికి గురైనట్లు సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా చెప్పినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై తమ పోరు కొనసాగుతుందని స్పష్టం చేశారు.
News December 14, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓటింగ్ పర్సంటేజ్ ఎంతంటే? …

జిల్లాలో రెండవ విడత పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన తొలి రెండు గంటల్లో 20.27 శాతం పోలింగ్ నమోదయింది. బోయినపల్లి మండలంలో 18.25%, ఇల్లంతకుంట మండలంలో 23.81%, తంగళ్ళపల్లి మండలంలో 18.57% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 1,04,905 మంది ఓటర్ల గాను 21,268 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.


