News December 17, 2025
వెయ్యి ఓట్ల మెజారిటీతో కాళేశ్వరంలో బీఆర్ఎస్ గెలుపు

మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం మేజర్ పంచాయతీలో బీఆర్ఎస్ అభ్యర్థి వెన్నపురెడ్డి మోహన్ రెడ్డి గెలుపొందారు. సుమారు వెయ్యికి పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అధికార కాంగ్రెస్‌కి సగం ఓట్లు కూడా రాకపోవడం గమనార్హం.
Similar News
News December 22, 2025
అంబాజీపేట: 1729 ఆకృతిలో ఆకట్టుకున్న విద్యార్థులు

దేశానికి గణిత మేధావిగా శ్రీనివాస రామానుజన్ ఎంతో కీర్తి ప్రతిష్ఠలు సాధించారని అంబాజీపేట మండలం కె.పెదపూడి జడ్పీహెచ్ స్కూల్ హెచ్ఎం వేణుగోపాలకృష్ణ చెప్పారు. జాతీయ గణిత దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. శ్రీనివాస రామానుజన్‌కు ఎంతో ఇష్టమైన సంఖ్య 1729 అని, దీనిని 2 ఘనముల మొత్తంగా వ్రాయగల చిన్న సంఖ్య కావటంతో దీనిని ‘రామానుజన్ సంఖ్య’ అంటారన్నారు. 1729 అంకెల నమూనాతో విద్యార్థులు ఆకట్టుకున్నారు.
News December 22, 2025
ప్రజా దివాస్ దరఖాస్తులపై తక్షణ చర్యలు చేపట్టాలి: ఎస్పీ

ప్రజా దివాస్ దరఖాస్తులపై తక్షణ చర్యలు చేపట్టాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. ప్రజా దివాస్ కార్యక్రమంలో భాగంగా ఈ సోమవారం భూపాలపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి పరిశీలించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మొత్తం 10 దరఖాస్తులను ఎస్పీ శ్రద్ధగా పరిశీలించి, సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు.
News December 22, 2025
పెట్టుబడులు రావడం KCRకు ఇష్టం లేదేమో: మంత్రి శ్రీధర్

TG: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధిని KCR ఎందుకు చూడలేకపోతున్నారో అర్థం కావడం లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గ్లోబల్ సమ్మిట్ ఒప్పందాలపై KCR కామెంట్లను ఆయన ఖండించారు. ‘పెట్టుబడులు, ఉద్యోగాలు రావడం KCRకు ఇష్టం లేనట్టుంది. BRS హయాంలో జరిగిన చాలా ఒప్పందాలు కార్యరూపం దాల్చలేదు. అభివృద్ధికి దోహదపడేలా KCR సలహాలివ్వాలి. BRS నేతలు హైప్‌లో ఉన్నారు. మేం ప్రజలకు హోప్ ఇస్తున్నాం’ అని పేర్కొన్నారు.


