News September 6, 2024
వెలిగల్లు ప్రాజెక్టులో గణేశ్ విగ్రహాల నిమజ్జనం నిషేధం

వెలిగల్లు జలాశయంలో గణేశ్ విగ్రహాల నిమజ్జనం నిషేధించామని ప్రాజెక్టు డీఈఈ సురేశ్ కుమార్ స్పష్టం చేశారు. ‘ఈ ప్రాజెక్టు ద్వారా లక్కిరెడ్డిపల్లె, రామాపురం, గాలివీడు, రాయచోటి మండలాలకు సాగు, తాగు నీటిని అందించాల్సి ఉంది. నిమజ్జనం చేస్తే విగ్రహాలకు వినియోగించే రంగులు, రసాయనిక పదార్థాలతో నీటి కాలుష్యం జరుగుతుంది. జల కాలుష్య నివారణలో భాగంగా ప్రాజెక్టులో నిమజ్జనాన్ని నిషేధించాం’ అని డీఈఈ తెలిపారు.
Similar News
News February 27, 2026
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి: జేసీ

జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని శుక్రవారం DIEPC సమావేశంలో జేసీ నిధి మీనా సంబంధిత అధికారులను ఆదేశించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా 18 శాఖలకు సంబంధించి 11,033 దరఖాస్తులు వచ్చాయని, 10,886 దరఖాస్తులకు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. 10,836 పరిశీలనలో, 50 పరిశీలనకు సిద్ధంగా ఉన్నాయన్నారు. 88 దరఖాస్తులను తిరస్కరించడం జరిగిందన్నారు. 59 దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచడం జరిగిందన్నారు.
News February 27, 2026
బి.మఠం: మృతులు బద్వేలు వాసులుగా గుర్తింపు

బ్రహ్మంగారిమఠం మండలం నంది పల్లె పాల డైరీ వద్ద లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు <<19255263>>మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. మృతులు భార్యభర్తలు కావ్య, ప్రసాద్‌గా స్థానికులు గుర్తించారు.బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మార్తమ్మ నగర్‌లో నివాసం ఉంటున్నట్లుగా సమాచారం. వీరి తల్లిదండ్రులు బద్వేల్ మున్సిపాలిటీ కుమ్మరి కొట్టాలలో ఉన్నారని తెలుస్తోంది.
News February 27, 2026
బ్రహ్మంగారిమఠంలో ఘోర రోడ్డు ప్రమాదం

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం దొడ్ల డైరీ వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌పైకి లారీ దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ లారీ కిందకి వెళ్లడంతో మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే మంటలను అదుపు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


