News January 18, 2026
వెలిగొండ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తవ్వాలి: CM

AP: ప్రాధాన్యతల వారీగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని CM చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేయాల్సిన కీలక ప్రాజెక్టులపై సమీక్షించారు. ‘గతేడాది గడుపు పెట్టుకుని హంద్రీ-నీవా కాల్వ వెడల్పు పనులు పూర్తి చేశాం. పోలవరం పనులు పరుగులు పెట్టించాం. 2026లో వెలిగొండ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల నిర్మాణ పనులు పూర్తవ్వాలి’ అని ఆదేశించారు. నల్లమల సాగర్ సహా వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులపైనా చర్చించారు.
Similar News
News February 15, 2026
ఛావా, పుష్ప-2 రికార్డులు బ్రేక్

రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా ఓటీటీలోకి వచ్చినప్పటికీ థియేటర్లలోనూ ఇంకా క్రేజ్ తగ్గలేదు. BMSలో లాంగెస్ట్ ట్రెండింగ్(59 రోజులు) ఇండియన్ ఫిల్మ్‌గా సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ క్రమంలో విక్కీ కౌశల్ ‘ఛావా’(58 D) రికార్డును బ్రేక్ చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో స్త్రీ-2(57 D), ప్రేమలు, పుష్ప-2(53 D), మంజుమ్మల్ బాయ్స్(50 D) ఉన్నాయి.
News February 15, 2026
శివరాత్రికి జాగరణ ఎందుకు చేస్తారు?

శివరాత్రి రోజున గ్రహాల స్థితి వల్ల భూమిపై సహజంగానే శక్తి ఊర్థ్వ ముఖంగా ప్రవహిస్తుంది. అందుకే వెన్నెముక నిటారుగా ఉంచి మేల్కొని ఉండటం వల్ల ఆ శక్తిని మనం పూర్తిగా గ్రహించవచ్చు. నిద్రను జయించి, రాత్రంతా శివనామ స్మరణ, భజనలు చేయడం వల్ల మనసులోని అజ్ఞానమనే చీకటి తొలగిపోతుంది. సినిమాలు లేదా కబుర్లతో కాకుండా, ధ్యానంతో గడిపే జాగరణ మాత్రమే శివతత్వాన్ని మనలో జాగృతం చేసి, మోక్ష మార్గానికి దారితీస్తుంది.
News February 15, 2026
డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకలాజికల్ రీసెర్చ్‌లో ఇంటర్న్‌షిప్

<


