News October 30, 2024
వెలిగొండ సందర్శనకు బైకులపై వెళ్లిన మంత్రులు
వెలుగొండ ప్రాజెక్టు వద్ద ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించేందుకు అధికారులు కూటమి మంత్రులు, MLAలు ఇన్‌ఛార్జులు వచ్చారు. ఈ సందర్భంగా.. మంత్రులు నిమ్మల రామానాయుడు, స్వామి, గొట్టిపాటి, MP మాగుంట, MLAలు ఉగ్రా, దామచర్ల, కందుల, ఇన్‌ఛార్జులు గొట్టిపాటి లక్మీ, ఎరిక్షన్ బాబు ద్విచక్ర వాహనాలపై వెలుగొండ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన ఫోటో వైరల్ అవుతుంది.
Similar News
News October 30, 2024
అధిక రేట్లకు మద్యం అమ్మితే చర్యలు: ఒంగోలు SP
MRP కంటే అధిక రేట్లకు మద్యం అమ్మితే చర్యలు తప్పవని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులతో మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక రేట్లకు మద్యం అమ్మితే షాపులను సీజ్ చేసి కేసుల నమోదు చేయాలన్నారు. జిల్లాలో బెల్ట్ షాపులపై ప్రత్యేక నిఘా పెట్టాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం కట్టడి చేయాలని అధికారులకు సూచించారు.
News October 29, 2024
పొన్నలూరులో వాహన తనిఖీలు.. వెలుగులోకి బాలుడి కిడ్నాప్
పొన్నలూరు మండలంలోని నాగిరెడ్డిపాలెం జంక్షన్ వద్ద ఎస్ఐ అనూక్ మంగళవారం వాహనాల తనిఖీ నిర్వహించారు. కనిగిరి నుంచి వస్తున్న ఓ కారుని ఆపి తనిఖీ చేశారు. కారులోని మహిళ వద్ద ఏడాది బాబు ఉండటంతో పాటు ఆమె మాటలకు అనుమానం వచ్చి విచారించినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా ఆ బాలుడుని కావలిలో కిడ్నాప్ చేసినట్లు మహిళ అంగీకరించిందని ఆయన వెల్లడించారు.
News October 29, 2024
పెన్షన్ల పంపిణీపై ప్రకాశం జిల్లా కలెక్టర్ సమీక్ష
నవంబర్ నెలలో జిల్లాలో పంపిణీ చేయనున్న పెన్షన్ల పంపిణీపై జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సమీక్ష నిర్వహించారు. పెన్షన్స్ పంపిణీ గురించి మాట్లాడుతూ.. 31వ తేదీన దీపావళి పండుగ నేపథ్యంలో ఈనెల 30వ తేదీనే ముందస్తుగానే బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసుకోవాలన్నారు. 1వ తేదీన ఉదయం 5గంటలకి లబ్ధిదారులకు సచివాలయాల సిబ్బంది పెన్షన్లు పంపిణీ ప్రారంభించాలన్నారు.