News October 19, 2025
వెలుగులను నింపేది దీపావళి: జనగామ కలెక్టర్

చీకట్లను తొలగించి వెలుగును అందించే పండగ దీపావళి అని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులను నింపే దీపావళి సందర్భంగా కుటుంబ సభ్యులందరితో కలిసి జిల్లా ప్రజలందరూ సంతోషంగా, సురక్షితంగా జరుపుకోవాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News October 19, 2025
పారిశ్రామికవేత్తలకు CM చంద్రబాబు శుభవార్త

AP: పారిశ్రామికవేత్తలకు CM చంద్రబాబు దీపావళి సందర్భంగా శుభవార్త చెప్పారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు విడుదల చేసి ఆయా సంస్థలకు చేయూత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా రూ.1500 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలను తొలి విడతగా త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు ట్వీట్ చేశారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
News October 19, 2025
MBNR: దీపావళి.. ఎస్పీ కీలక మార్గదర్శకాలు

మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె పండుగకు కొన్ని కీలక మార్గదర్శకాలు చేశారు. లైసెన్స్ పొందిన విక్రేతల వద్ద మాత్రమే బాణసంచా కొనాలని, బహిరంగ ప్రదేశాలలోనే కాల్చాలని సూచించారు. మండే పదార్థాలకు దూరంగా ఉండాలని, సింథటిక్ కాకుండా కాటన్ దుస్తులు ధరించాలని తెలిపారు. పిల్లలు పెద్దల పర్యవేక్షణలో మాత్రమే పటాకులు కాల్చాలని సూచించారు.
News October 19, 2025
VZM: నిబంధనలు పాటించని బాణాసంచా వ్యాపారులు

నగరంలోని బాణాసంచా షాపు యజమానులు అగ్నిమాపక నిబంధనలు పాటించడం లేదు. KL పురంలో అధికారికంగా 8 షాపులు ఉండగా, తాత్కాలిక అనుమతులతో మరో 15 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ మంటలు చెలరేగితే ఆర్పేలా సంబంధిత పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే ఇక్కడ 25వేల లీటర్ల నీటి సామర్ధ్యంతో ఒక సంపు, నిర్మించుకోవాలి. క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాల్సిన అగ్నిమాపక అధికారులు అటు వైపు చూడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.