News September 13, 2025
వెల్గటూర్: రోడ్డు ప్రమాదం.. యువకులకు గాయాలు

వెల్గటూర్ మండలం కిషనరావుపేట్ గ్రామ బస్టాప్‌కు సమీపంలో రాష్ట్ర రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి కింద పడిన ఘటనలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వెల్గటూర్ నుంచి ధర్మారం వైపు వెళ్తున్న పల్సర్ బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. గాయపడిన వారిని హుటాహుటిన అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
Similar News
News September 13, 2025
HYD: పెళ్లి సంబంధాల పేరుతో రూ.25 లక్షల మోసం.. అరెస్ట్

పెళ్లి సంబంధాలు చూస్తామని మ్యాట్రిమోనీ వెబ్ సైట్‌లో మోసం చేసిన అనీశ్(33)ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ వీడియో కాల్స్ చేయించి, మెప్పించి, చివరికి అకౌంట్‌లో నుంచి రూ.25 లక్షలు కాజేసినట్లు ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. పోలీసులు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకున్నారు.

పల్నాడు జిల్లా ఎస్పీగా డి.కృష్ణారావు

పల్నాడు జిల్లా ఎస్పీగా డి.కృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా కృష్ణారావును పల్నాడుకు ప్రభుత్వం బదిలీ చేసింది. పలు కేసులలో సమర్థవంతంగా వ్యవహరించిన ఆయన ప్రభుత్వ మన్నన్నలు, ప్రజాభిమానం పొందారు. కాగా ప్రస్తుతం ఇప్పటివరకు పల్నాడు ఎస్పీగా పనిచేసిన కంచి శ్రీనివాసరావుకు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వలేదు.