News August 30, 2025
వెల్గటూర్: విద్యార్థుల చదువుల కోసం స్థల పరిశీలన

వెల్గటూర్ మండలం స్తంభంపల్లి & పాసిగామ గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూ స్థలాన్ని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ సెక్రెటరీ అలుగు వర్షిని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు. విద్యార్థుల చదువుల కోసం డిగ్రీ, పీజీ, బీ ఫార్మసీ కోర్సుల కొరకు అన్ని విధాల సదుపాయాలు ఉండేలా ఈ ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించడం జరిగింది అని మంత్రి తెలిపారు.
Similar News
News August 30, 2025
మెదక్: దెబ్బతిన్న 60 పీఆర్ రోడ్లు డ్యామేజ్

మెదక్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మొత్తం 60 పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిన్నాయి. ఇందులో 29 చోట్ల కల్వర్టులు, 14 చోట్ల రోడ్లు పాక్షికంగా దెబ్బతినగా.. 17 చోట్ల రోడ్లకు గండ్లు పడ్డాయని పంచాయతీరాజ్ జిల్లా ఇంజినీర్ నర్సింలు తెలిపారు. దెబ్బతిన్న రోడ్ల తాత్కాలిక మరమ్మతులకు రూ.3.99 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.17.11 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపామన్నారు. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నారు.
News August 30, 2025
VKB: జిల్లాలో 594 పంచాయతీలు 5058 వార్డులు

జిల్లాలో ఓటర్ల వివరాలను పంచాయతీ కార్యాలయాల వద్ద డిస్ ప్లే చేశారు. వికారాబాద్ జిల్లాలో 594 గ్రామపంచాయతీలు 5058 వార్డులు ఉన్నట్లు జిల్లా అధికారులు దృవీకరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా సిద్ధమవుతుంది. ఇప్పటికే గ్రామ పంచాయతీల వద్ద ఓటర్ల జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించారు.
News August 30, 2025
ఆగస్టు 30: చరిత్రలో ఈ రోజు

1871: భౌతిక శాస్త్రవేత్త ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ జననం
1913: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత రిచర్డ్ స్టోన్ జననం
1936: సినీ నటి జమున జననం (ఫొటోలో)
1949: స్వాతంత్ర్య సమరయోధురాలు, తెలుగు రచయిత్రి తల్లాప్రగడ విశ్వసుందరమ్మ మరణం
1980: తెలుగు, హిందీ నటి రిచా పల్లాడ్ జననం
1994: సినీ హీరోయిన్ నందిత రాజ్ జననం