News April 10, 2025
వెల్దుర్తి: క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం వెళ్తే.. ఏమైందో చూడండి.!

వెల్దుర్తిలో తహశీల్దార్ కార్యాలయంలో వింత ఘటన జరిగింది. పట్టణానికి చెందిన కృష్ణ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం కోసం బుధవారం తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. అధికారులు నీకు ఎస్సీ కుల ధ్రువీకరణ నమోదు జాబితాలో లేదని చెప్పారన్నారు. చిన్నప్పటి నుంచి పీజీ వరకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం ఉందని, కానీ ఈ సం,, కుల ధ్రువీకరణ పత్రం తొలగించారని వాపోయారు. ఈ తప్పిదంతో ఎస్సీ కార్పొరేషన్ కోల్పోతానని వెల్లడించాడు.
Similar News
News April 18, 2025
ఎల్లెల్సీకి నిలిచిన నీటి సరఫరా

తుంగభద్ర దిగువ కాలువకు నీటి సరఫరా నిలిచిపోయింది. రెండ్రోజుల క్రితం వరకు నీటి సరఫరా కొనసాగగా తాజాగా పూర్తిగా నిలిపివేశారు. తుంగభద్ర డ్యాంలో నీటి నిల్వలు తగ్గుముఖం పడటంతో ఉన్నతాధికారుల అదేశాల మేరకు నిలిపివేసిటన్లు సమాచారం. టీబీ డ్యాంలో ప్రస్తుతం 7.037 టీఎంసీల నీరు నిల్వ ఉండగా జలాశయానికి ఎలాంటి ఇన్ ఫ్లో లేదు.
News April 18, 2025
కర్నూలులో క్వింటా ఉల్లి రూ.879

ఉల్లి ధరలు భారీగా పడిపోయాయి. కర్నూలు మార్కెట్‌కు నిన్న 479 క్వింటాళ్ల సరకు రాగా గరిష్ఠ ధర క్వింటా రూ.879, కనిష్ఠ రూ.675, సగటు రూ.755 పలికింది. మహారాష్ట్ర నుంచి జిల్లాకు భారీగా దిగుమతి అవుతుండటంతో ధరలపై ఎఫెక్ట్ పడిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక మిర్చి క్వింటా రూ.4వేల నుంచి రూ.7వేల వరకు పలుకుతోంది.
News April 18, 2025
కర్నూలు: స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్రపై జేసీ ఆదేశాలు

ఏప్రిల్ 19న నిర్వహించనున్న స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కర్నూలు జేసీ డా.బి.నవ్య అధికారులకు ఆదేశించారు. గురువారం టెలి కాన్ఫరెన్స్‌లో భాగంగా ఎలెక్ట్రానిక్ వెస్ట్ కలెక్షన్, వాట్సాప్ గవర్ననెన్స్‌పై అవగాహన కల్పించే చర్యలు చేపట్టాలని సూచించారు. రెడ్యూస్ రీసైకిల్ & రీయూస్ సెంటర్లను ఏర్పాటుచేసి, మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చెప్పారు.