News April 3, 2024

వెల్దుర్తి: తోటలో పనికి వచ్చిన వ్యక్తి సూసైడ్

image

వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధి శెట్టిపల్లి కలాన్ శివారులో కొబ్బరి తోటలో పనిచేసేందుకు వచ్చిన వెంకటరమణ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఏపీలోని వడ్లమూరుకు చెందిన వెంకటరమణ, భాగ్యలక్ష్మి దంపతులు 3 నెలల క్రితం తోటలో పని చేసేందుకు వచ్చారు. రాత్రి మద్యం సేవించి రాగా భార్య గొడవ చేయడంతో బయటకు వెళ్లి విషం తాగాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేశారు.

Similar News

News September 9, 2025

మెదక్: ‘ఫిర్యాదుల పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేయాలి’

image

మహిళలకు సురక్షితమైన పని ప్రదేశాలను నిర్ధారించడానికి, భారత ప్రభుత్వం పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం అమలులో ఉన్నట్లు జిల్లా అధికారి హేమ భార్గవి తెలిపారు. ఈ చట్టం ప్రభుత్వం, ప్రైవేట్ ప్రతి యజమాని లైంగిక వేధింపులు లేని కార్యాలయాన్ని అందించాలని, ఫిర్యాదుల పరిష్కారం కోసం అంతర్గత ఫిర్యాదులు, కార్యాలయంలో లైంగిక వేదింపుల ఫిర్యాదులను పరిష్కారం కోసం ఉద్యోగులతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.

News September 9, 2025

మెదక్: ఈనెల 13న జాతీయ మెగా లోక్ అదాలత్‌

image

ఈ నెల 13న జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. “రాజీ మార్గమే రాజమార్గం. కక్షలతో ఎటువంటి లాభం ఉండదని, కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని” అన్నారు. రాజీ పడితే ఇరువురూ గెలుస్తారని, కొట్టుకుంటే ఒకరే గెలుస్తారని స్పష్టం చేశారు. ప్రజలు లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు.

News September 9, 2025

చిలిపిచేడ్: విద్యుత్ షాకుతో వ్యక్తి మృతి

image

వ్యవసాయ పొలం వద్ద విద్యుత్ షాక్ తగిలి కూలి మృతి చెందిన ఘటన చిలిపిచేడ్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. చిట్కూల్ గ్రామానికి చెంది భవానిపల్లి కుమార్ అనే వ్యక్తి స్థానికంగా ఒక వ్యవసాయ క్షేత్రంలో కూలికి వెళ్లి గడ్డి కోత మిషన్‌తో గడ్డి కోస్తుండగా విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందారు. బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు