News November 10, 2025
వెల్దుర్తి: పెద్దపులి దాడిలో రెండు గేదెలు మృతి.?

వెల్దుర్తి మండలం నల్లమల అటవీ ప్రాంతంలోని వజ్రాలపాడు తండా సమీపంలో పెద్దపులి దాడి ఘటన కలకలం రేపింది. మూఢావత్ తులస్యానాయక్ గేదె శనివారం, మరో గేదె ఆదివారం మృత్యువాత పడ్డాయి. రేంజర్ సుజాత మాట్లాడుతూ.. పశువులను అడవిలోకి పంపవద్దని, రాత్రి వేళ పెట్రోలింగ్ కొనసాగుతోందని చెప్పారు. ట్రాప్ కెమెరాలు, పాదముద్రల ద్వారా పులి కదలికలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.
Similar News
News November 10, 2025
కిర్లంపూడి: నలుగురికి చేరిన మృతుల సంఖ్య

కిర్లంపూడి మండలం ఎన్.హెచ్. 16 జాతీయ రహదారిపై ఈ నెల 8న ఓ పెళ్లి కారు ఢీకొనడంతో ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న జగ్గంపేట మండలం ఇర్రిపాకకు చెందిన యువతి కూండ్రపు దుర్గా చైతన్య సోమవారం ఉదయం కన్నుమూసింది. దీంతో ఈ ప్రమాదంలో మృతి చెందినవారి సంఖ్య నాలుగుకు చేరింది.
News November 10, 2025
6 గంటల్లోనే జీవ వ్యర్థాల నుంచి జీవ ఎరువుల తయారీ

జీవవ్యర్థ పదార్థాలను జీవ ఎరువులుగా మార్చే పరిశ్రమ త్వరలో HYDలోని ప్రొ.జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ వర్సిటీలో ఏర్పాటు కానుంది. ఈ మేరకు వియత్నాంకు చెందిన జీవ ఎరువుల తయారీ సంస్థ ‘బయోవే’తో.. వర్సిటీ ఒప్పందం చేసుకుంది. రూ.5 కోట్లతో ఈ ఎరువుల యూనిట్‌ను 2 నెలల్లోనే ఏర్పాటు చేసి ఉత్పత్తి ప్రారంభించనున్నారు. జీవవ్యర్థాల నుంచి 6 గంటల్లోనే జీవ ఎరువులను తయారు చేయవచ్చని ‘బయోవే’ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
News November 10, 2025
విదేశాల్లో పిల్లలు.. కుమిలిపోతున్న తల్లిదండ్రులు!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కోసం యువత విదేశాలకు వెళ్లడం సర్వసాధారణమైంది. ప్రారంభంలో ఏడాదికోసారి పిల్లల వద్దకు ఉత్సాహంగా వెళ్లే తల్లిదండ్రులు వయసు పెరిగే కొద్దీ (60+) సుదీర్ఘ ప్రయాణాలు, ఆరోగ్య సమస్యల కారణంగా వెళ్లడం మానేస్తున్నారు. అయితే ఉద్యోగాలు, వీసా సమస్యలతో పిల్లలు కూడా ఇండియాకు రాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్రమైన ఒంటరితనానికి లోనవుతూ కుమిలిపోతున్నారు. చివరి రోజుల్లోనూ పిల్లల ప్రేమ పొందలేకపోతున్నారు.


