News July 7, 2025
వెల్లలచెరువులో వ్యక్తి మృతి

సంతమాగులూరు మండలం వెల్లలచెరువు గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. పుట్టవారిపాలెం నుంచి వినుకొండ వైపు వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్ ట్రాక్టర్ టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News July 7, 2025
మెదక్ జిల్లా విద్యుత్తు శాఖ ఎస్ఈగా నారాయణ నాయక్

మెదక్ జిల్లా విద్యుత్తు శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ)గా నారాయణ నాయక్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా విద్యుత్తు శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్‌గా బాధ్యతలు నిర్వహించిన శంకర్ గత నెలలో ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న నారాయణ నాయక్ నియమితులయ్యారు.
News July 7, 2025
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి వాతావరణ శాఖ అధికారుల సూచన మేరకు జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుత అంచనా ప్రకారం సర్దార్ కాటన్ బ్యారేజీలో ఈ నెల 12వ తేదీ నాటికి 9 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు చేరే అవకాశం ఉందని, అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు.
News July 7, 2025
నల్గొండలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి..!

నల్గొండలో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు వన్ టౌన్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఓ యువకుడు, ఇద్దరు మహిళలని అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా కలెక్టర్ ఆఫీస్ వెనకాల ఓ ఇంటిని కిరాయికి తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తున్న వ్యవహారంపై నిఘా పెట్టారు. నమ్మదగిన సమాచారం మేరకు ఈ రోజు మెరుపు దాడులు చేసి పట్టుకున్నట్లు సమాచారం.