News December 30, 2025

వేంకటేశ్వర స్వామి పల్లకి సేవలో మంత్రి దామోదర్

image

వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం తెల్లవారుజామున ఉత్తర ద్వారం మీదుగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. అంతకుముందు వెంకటేశ్వర స్వామి పల్లకి సేవను స్వయంగా ఉరేగింపులో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు ఆధ్వర్యంలో మంత్రిని ఘనంగా సన్మానించారు.

Similar News

News December 31, 2025

కృష్ణా: ముడా భూములకు రక్షణ ఏది.?

image

మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) పరిధిలో అక్రమ మట్టి తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు, అవినీతిని భరించలేక ఛైర్మన్ పదవికి మట్టా ప్రసాద్ రాజీనామా చేయగా, ప్రస్తుతం ఆ పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. ప్రకృతి వనరుల దోపిడీ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం స్పందించి ‘ముడా’ భూములను కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

News December 31, 2025

పల్నాడు: కొమ్మాలపాటి పయనం ఎటు.?

image

పల్నాడు TDP అధ్యక్షుడిగా మొన్నటి వరకు ఉన్న కొమ్మాలపాటి శ్రీధర్‌కు ఊహించని షాక్ తగిలిన విషయం తెలిసిందే. జిల్లా అధ్యక్షుడిగా ఆయనే కొనసాగుతారని అనుకున్న తమ్ముళ్లకు పార్టీ అధిష్ఠానం బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. గతంలో పెదకూరపాడు టికెట్ ఆశించిన శ్రీధర్‌ను పక్కన పెట్టి అధిష్ఠానం భాష్యం ప్రవీణ్‌కు కట్టబెట్టగా.. శ్రీధర్‌కు అధ్యక్షుడి పదవి ఇచ్చారు. ప్రస్తుతం అది కూడా పోవడంతో శ్రీధర్ పయనం ఏంటనే చర్చ మొదలైంది.

News December 31, 2025

ఆదిలాబాద్: బాలుడి కిడ్నాప్

image

ADBలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి కిడ్నాప్‌‌కు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ సునీల్ ప్రకారం.. NRML జిల్లాకు చెందిన మాణిక్ రావు కొడుకు ADBలోని శ్రీరాంరెడ్డిలో చదువుతున్నాడు. ఈనెల 20న గుర్తుతెలియని వ్యక్తి బాబాయ్‌నని చెప్పి తీసుకెళ్లి, MHలోని వదోలిలో వదిలిపెట్టాడు. పాఠశాల నుంచి వెళ్లే సమయంలో అవుట్‌పాస్ వివరాలు నమోదు చేయకపోవడంపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.