News April 13, 2025
వేంపల్లి: 10వ తరగతి బాలికపై అత్యాచారం

వేంపల్లి మండలంలోని పదో తరగతి బాలికపై ఫాజిల్ అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. ‘ఇటీవల బాలికను వేంపల్లె గాంధీరోడ్డులో చికెన్ దుకాణంలో పనిచేసే ఫాజిల్ కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో కేసును నమోదు చేశాం. అలాగే అతడికి సహకరించారని చికెన్ దుకాణం ఓనర్ ఆనంద్‌పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం’ అని సీఐ తెలిపారు.
Similar News
News September 10, 2025
కడప జిల్లాలో పలువురు పోలీస్ సిబ్బంది బదిలీ

కడప జిల్లాలో 44 మంది పోలీస్ సిబ్బందిని బదిలీ చేస్తూ ఎస్పీ అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం బదిలీలు చేపట్టినట్లు ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. తక్షణం ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. మరో 11 మంది సిబ్బందిని వివిధ చోట్ల అటాచ్ చేశారు. బదిలీ అయిన వారిలో పలువురు ASIలు, HCలు, PCలు, WPCలు ఉన్నారు.
News September 10, 2025
కడప మేయర్ సురేశ్ బాబుకు మరోసారి నోటీసులు

కడప నగరపాలక సంస్థ మేయర్ సురేశ్ బాబుకు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 17న హాజరుకావాలని ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ కుమార్ నోటీసులు పంపారు. ఇదే చివరి అవకాశం అంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యులకు చెందిన సంస్థలకు కాంట్రాక్ట్ పనులు మంజూరు చేసినట్లు వచ్చిన ఆరోపణల కారణంగా కోర్టు నోటీసులు జారీ చేసింది.
News September 10, 2025
కడప: బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడి అరెస్ట్

కడప తాలూకా స్టేషన్ పరిధిలో బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితుడు రాజ్ కుమార్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ రెడ్డప్ప, SI తులసినాగ ప్రసాద్ తెలిపారు. భగత్ సింగ్ నగర్‌కు చెందిన రాజ్ కుమార్ అనే రౌడీషీటర్ అయిదేళ్ల చిన్నారిపై ఈనెల 7వ తేదీన అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గుర్తించి అతన్ని పట్టుకుని దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించారు. దీంతో అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు.