News March 5, 2025

వేంపల్లె : ట్రిపుల్ ఐటీ విద్యార్థినిపై లైంగిక వేధింపులు

image

వేంపల్లె మండలం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఎస్ఐ తిరుపాల్ నాయక్ పేర్కొన్నారు. బుధవారం ఒంగోలు ట్రిపుల్ ఐటీలో ఫిజిక్స్ ఒప్పంద అధ్యాపకుడు తిరుపతిరావుపై విద్యార్థిని ఫిర్యాదు మేరకు స్థానిక ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు సమాచారం. విద్యార్థినిపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న అధ్యాపకుడు తిరుపతిరావు రాజీనామా చేసి వెళ్లిపోయినట్లు తెలిసింది.

Similar News

News March 6, 2025

చాపాడు: భార్యను గొడ్డలితో నరికిన భర్త

image

చాపాడు మండలం నక్కలదిన్నె సమీపంలో గురువారం మధ్యాహ్నం భార్య‌ను భర్త యెర్రిబోయిన భాస్కర్ గొడ్డలితో నరికాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భార్యపై అనుమానంతో భర్త ఈ ఘాతకానికి పాల్పడినట్లు గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. ట్రైనీ డీఎస్పీ భవానీ, ఎస్సై చిన్న పెద్దయ్య ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 6, 2025

సిద్దవటం: ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నం

image

మండలంలోని ఉప్పరపల్లె గ్రామ శివారులోని ప్రభుత్వ స్థలంపై అక్రమార్కుల కన్ను పడింది. లక్షలు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని చదును చేసి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. శేఖరాజుపల్లె రెవెన్యూ గ్రామం పరిధిలో సర్వే సంఖ్య 421/1, 424 లో ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంది. ఇక్కడ సుమారు 50 సెంట్లను ఇటీవల స్థానికుడు యంత్రంతో చదును చేసి ఆక్రమించాడు. ఈ విషయమై ఇన్‌ఛార్జ్ MRO మాధవీ లతను వివరణ కోరగా చర్యలు తీసుకుంటామన్నారు.

News March 6, 2025

కడప: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

వైయస్సార్ కడప జిల్లా పరిధిలోని ఎర్రగుంట్ల సమీపంలో గురువారం తెల్లవారు జామున ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, లారీ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. చిలంకూరు వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మమ్మ (58), వెంకట ఆంజనేయులు(55) మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!